Student Flex: ‘పది’ పాసైనందుకు తనకు తానే ఫ్లెక్సీ కట్టించుకున్న విద్యార్థి

పదో తరగతి పాసైనందుకుగాను, తనకుతానే అభినందనలు తెలుపుతూ ఒక ఫ్లెక్సీ ప్రింటు చేయించుకున్నాడు. ఆ ఫ్లెక్సీని తన ఇంటికి దగ్గర్లో ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఫ్లెక్సీ అంశం స్థానికంగా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

Student Flex

Student Flex: కేరళకు చెందిన ఒక విద్యార్థి పదో తరగతి పాసైనందుకు తనను తానే అభినందించుకుంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకున్నాడు. పతనంతిట్ట జిల్లాకు చెందిన జిష్ణు అనే విద్యార్థి ఈ ఏడాది జరిగిన పదో తరగతి పరీక్షల్లో పాసయ్యాడు. ఈ నెల 15న ఫలితాలు వెలువడ్డాయి. దీంట్లో జిష్ణు మంచి పర్సంటేజీతో పాసయ్యాడు. పదో తరగతి పాసైనందుకుగాను, తనకుతానే అభినందనలు తెలుపుతూ ఒక ఫ్లెక్సీ ప్రింటు చేయించుకున్నాడు. ఆ ఫ్లెక్సీని తన ఇంటికి దగ్గర్లో ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఫ్లెక్సీ అంశం స్థానికంగా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ టీనేజ్ స్టూడెంట్ చేసిన కొత్త ఆలోచనను చాలా మంది ప్రశంసిస్తున్నారు. ఈ విషయం వైరల్‌గా మారడంతో దీనిపై కేరళ విద్యా శాఖ మంత్రి వి.శివకుట్టి కూడా స్పందించాడు.

Maharashtra Crisis: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ అడుగులు

‘‘జిష్ణు తన విజయాన్ని తానే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. అతడికి జీవితంలో అంతా మంచే జరగాలి. అనుకున్న విజయాలు సాధించాలి. మా ప్రభుత్వం విద్యా సంబంధమైన అంశాల్ని ప్రోత్సహిస్తుంది. జిష్ణు తన జీవిత పరీక్షల్ని కూడా పాసవ్వాలని కోరుకుంటున్నా’’ అని మంత్రి తన సోషల్ మీడియా అకౌంటులో పేర్కొన్నాడు. కాగా, ఈ ఏడాది కేరళలో 4,26,469 మంది పదో తరగతి పరీక్షలు రాయగా, 4,23,303 మంది పాసయ్యారు. అంటే పాసైన విద్యార్థుల శాతం 99.26గా ఉంది. గత ఏడాది 99.47 శాతం మంది విద్యార్థులు పదో తరగతి పాసయ్యారు.