Koratala
Koratala Shiva : మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వనుంది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్ లుగా నటించగా కొణిదెల ప్రొడక్షన్స్, మాట్ని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా సినిమాని నిర్మించారు. ఆచార్య సినిమాకి సంబంధించి మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ(ఏప్రిల్ 23న) సాయంత్రం హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగింది. ఈ ఈవెంట్ కి మెగా అభిమానులు భారీగా తరలి వచ్చారు.
ఈ ఈవెంట్ లో కొరటాల శివ మాట్లాడుతూ.. ”నాలుగేళ్ల తర్వాత నాకు మైక్ దొరికింది నా సినిమాకి. చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన సినిమాలకి చొక్కాలు చింపుకొని మరీ చూశాము. ఆయనని చూస్తే చాలు అనుకున్నాను. కానీ ఆయనకు యాక్షన్ చెప్పే అవకాశం వచ్చింది. ఆయనతో చేసిన ప్రయాణం అద్భుతం. సినిమాకి ఆచార్య అని టైటిల్ పెట్టాను. నాకు నిజంగానే ఆయన రూపంలో ఆచార్య దొరికారు. మెగాస్టార్ అంటే గ్రేట్ యాక్టర్, డ్యాన్సర్ అని తెలుసు. కానీ ఈ సినిమాతో ఎంత గొప్ప మనిషో తెలుసుకున్నాను. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. నిర్మాతలు ఏది అడిగితే అది ఇచ్చారు. ఈ సినిమాకి చాలా టైం పట్టింది కరోనా వల్ల. ఇందుకు ఖర్చు కూడా పెరిగింది. అయినా వెనుకాడలేదు. కెమెరామన్ తిరు నా ప్రాణం. నా కంటే ఎక్కువ కష్టపడ్డాడు ఈ సినిమా కోసం. సురేష్ అద్భుతమైన సెట్ వేశాడు. మణిశర్మ గారి పాటలు వింటూ పెరిగాను. నా సినిమాకి కూడా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నా డైరెక్షన్ టీంకి, నా స్నేహితుడు సుధాకర్ కి థ్యాంక్స్. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ సెట్ లో అందర్నీ నవ్విస్తారు. రామ జోగయ్య శాస్త్రి గారు మంచి పాటలు అందించారు. పాటలు రాసిన అందరికి థ్యాంక్స్. చరణ్ కథ విన్నాక మీరు చేయాలి అంటే వెంటనే ఓకే చేశారు. రాజమౌళి గారి ఆర్ఆర్ఆర్ లో చరణ్ బిజీగా ఉన్నా నాకు డేట్స్ అడ్జస్ట్ అయ్యేలా చేసారు. థ్యాంక్స్ సర్. సినిమా మా నాలుగేళ్ళ కష్టం. అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు.
Pooja Hegde : స్టోరీ విన్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి
ఇప్పటికే ఈ సినిమా నుంచి లాహే లాహె, నీలాంబరి, సానా కష్టం, భలే భలే బంజారా లిరికల్ సాంగ్స్, టీజర్, ట్రైలర్ రిలీజ్ అయి భారీ స్పందన తెచ్చుకున్నాయి. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఆచార్య సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.