Pooja Hegde : స్టోరీ విన్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి

ఈవెంట్ లో పూజా హెగ్డే మాట్లాడుతూ.. ''ఆర్ఆర్ఆర్ తర్వాత మన సౌత్ సినిమాకి పెద్ద పేరు వచ్చింది. ముంబై వెళితే కచ్చితంగా తెలుగు సినిమా గురించి మాట్లాడుతున్నారు..............

Pooja Hegde : స్టోరీ విన్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి

Pooja

 

Pooja Hegde :  మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వనుంది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్ లుగా నటించగా కొణిదెల ప్రొడక్షన్స్, మాట్ని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా సినిమాని నిర్మించారు. ఆచార్య సినిమాకి సంబంధించి మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ(ఏప్రిల్ 23న) సాయంత్రం హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగింది. ఈ ఈవెంట్ కి మెగా అభిమానులు భారీగా తరలి వచ్చారు.

 

ఈ ఈవెంట్ లో పూజా హెగ్డే మాట్లాడుతూ.. ”ఆర్ఆర్ఆర్ తర్వాత మన సౌత్ సినిమాకి పెద్ద పేరు వచ్చింది. ముంబై వెళితే కచ్చితంగా తెలుగు సినిమా గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటి మంచి క్యారెక్టర్ నీలాంబరిని ఇచ్చినందుకు థ్యాంక్స్ కొరటాల శివ గారు. చిరంజీవి గారు స్వాగ్, స్టైల్ అది ఎవరికీ ఉండదు. నాకు కూడా కొంచెం నేర్పించండి సర్. రామ్ ప్రతి సినిమాకి బెస్ట్ అవుతున్నారు. చాలా సైలెంట్ గా ఉంటారు సెట్ లో. సెట్ చాలా బాగుంటుంది. టెక్నీషియన్స్ అందరికి థ్యాంక్స్. స్టోరీ విన్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. రేపు సినిమా చూసినప్పుడు కూడా ఆడియన్స్ అందరికి అలాగే అనిపిస్తుంది” అని తెలిపారు.

Producer Niranjan Reddy : చిరంజీవి, చరణ్, కొరటాల శివ డబ్బులు తీసుకోకుండా సినిమా చేశారు

ఇప్పటికే ఈ సినిమా నుంచి లాహే లాహె, నీలాంబరి, సానా కష్టం, భలే భలే బంజారా లిరికల్ సాంగ్స్, టీజర్, ట్రైలర్ రిలీజ్ అయి భారీ స్పందన తెచ్చుకున్నాయి. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఆచార్య సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.