Koratala Siva: ముగ్గురు హీరోలను లైన్‌లో పెడుతున్న కొరటాల
టాలీవుడ్‌లో స్టార్ రైటర్ నుండి డైరెక్టర్‌గా మారిన కొరటాల శివ, ప్రస్తుతం ఇండస్ట్రీలోని స్టార్ దర్శకుల్లో ఒకరిగా ఉన్నాడు. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా బాక్సాఫీస్....

Koratala Siva Lines Up Three Heroes For His Next Movies
Koratala Siva: టాలీవుడ్‌లో స్టార్ రైటర్ నుండి డైరెక్టర్‌గా మారిన కొరటాల శివ, ప్రస్తుతం ఇండస్ట్రీలోని స్టార్ దర్శకుల్లో ఒకరిగా ఉన్నాడు. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడంతో కొరటాలతో ఒక్క సినిమా అయినా చేయాలని స్టార్ హీరోలు చూస్తున్నారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన కొరటాల, ఈ సినిమా కోసం దాదాపుగా నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్నాడు.
Koratala Siva : సోషల్ మీడియాకు సెలవు..
దీంతో కొరటాల ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే హిట్ అందుకోవడం ఖాయమని ఆయన అభిమానులు అంటున్నారు. కాగా ఈ సినిమా తరువాత కొరటాల తన నెక్ట్స్ ప్రాజెక్టులను ఇప్పటికే ఒక లైన్‌లో పెట్టే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఆచార్య చిత్రం రిలీజ్ కాకముందే, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి తారక్ 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాను మే నెలలో సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు కొరటాల పక్కా ప్లానింగ్‌తో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆ తరువాత తన నెక్ట్స్ మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలని చూస్తున్నాడు ఈ స్టార్ డైరెక్టర్. గతంలో శ్రీమంతుడు, భరత్ అనే నేను వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన ఈ కాంబో, ఈసారి హ్యాట్రిక్ హిట్ అందుకునేందుకు రెడీ అవుతోందట.
Balakrishna – Koratala Siva : సెన్సేషనల్ కాంబినేషన్!
అటుపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కొరటాల ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. గతంలోనే చరణ్‌తో కొరటాల సినిమా చేయాల్సి ఉన్నా, అది కొన్ని కారణాల వల్ల కుదర్లేదు. దీంతో ఈసారి చరణ్‌తో సినిమా గ్యారెంటీ అంటున్నాడు ఈ డైరెక్టర్. ఇప్పటికే ఆయన చరణ్‌కు ఓ స్టోరీలైన్ వినిపించాడని, త్వరలోనే దాన్ని పూర్తి స్క్రిప్ట్‌గా రెడీ చేస్తాడని తెలుస్తోంది. ఇలా వరుసగా ముగ్గురు స్టార్ హీరోలను లైన్‌లో పెట్టిన కొరటాల తన నెక్ట్స్ ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని చూస్తున్నాడట. ఇక మరో స్టార్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కూడా కొరటాల సినిమా ఉంటుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అయితే ఈ విషయంపై కొరటాల క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.