KV Vijayendraprasad : నేను కథలు రాయను.. దొంగిలిస్తాను..

గోవాలో జరుగుతున్న 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో రచయిత KV విజయేంద్ర ప్రసాద్ ఫిల్మ్ రైటింగ్‌పై స్పెషల్ క్లాస్ తీసుకున్నారు. ఈ క్లాస్ లో పలు అంశాలని మాట్లాడారు...............

KV Vijayendraprasad :  రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత kv విజయేంద్ర ప్రసాద్ అందరికి సుపరిచితమే. రాజమౌళి సినిమాలకే కాక, మరెన్నో సూపర్ హిట్ టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలకి కథలని అందించారు. కేంద్రప్రభుత్వం సినీరంగానికి విజయేంద్ర ప్రసాద్ చేసిన సేవలకు గాను ఆయనకి రాజ్యసభ పదవిని కూడా ఇచ్చింది. ఇటీవల RRR కథతో అందర్నీ మెప్పించిన విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం రాజమౌళి-మహేష్ సినిమా కోసం కథని రెడీ చేస్తున్నారు.

గోవాలో జరుగుతున్న 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో రచయిత KV విజయేంద్ర ప్రసాద్ ఫిల్మ్ రైటింగ్‌పై స్పెషల్ క్లాస్ తీసుకున్నారు. ఈ క్లాస్ లో పలు అంశాలని మాట్లాడారు. పలు ఆసక్తికర విషయాలని వెల్లడించారు.

Avatar 2 : అవతార్ 2 టికెట్ రేట్లు మరీ ఇంతా.. వామ్మో..!

రచయిత kv విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ”RRR 2 సినిమా కథ గురించి కూడా ఆలోచిస్తున్నాము. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ప్రేక్షకులు.. ఇలా అందర్నీ మెప్పించే కథలు రాయాలి. ఈ విషయంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఒక అబద్దాన్ని అందంగా ఆచూపించడమే కథా రచన. నేను కథలు రాయను, దొంగిలిస్తాను. మన చుట్టే చాలా కథలు ఉంటాయి, నిజ జీవితంలో కూడా అనేక కథలు ఉంటాయి. అలాగే మన ఇతిహాసాలు రామాయణం, మహాభారతం, మన చరిత్రల నుంచి అనేక కథలు వస్తాయి. నేను కూడా అక్కడినుంచే కథలు తీసుకుంటాను. ఆ కథలని మనదైన శైలిలో రచించాలి” అని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు