Avatar 2 : అవతార్ 2 టికెట్ రేట్లు మరీ ఇంతా.. వామ్మో..!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు అవతార్ 2 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 2డీ, 3డీ, 4డీఎక్స్ 3డీ, ఐమ్యాక్స్3డీ ఫార్మట్లలో అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమాని రిలీజ్ చేయనున్నారు. మన దేశంలో.................

Avatar 2 : అవతార్ 2 టికెట్ రేట్లు మరీ ఇంతా.. వామ్మో..!

Avatar 2 ticket prices are very high

Avatar 2 : 13 ఏళ్ళ క్రితం వచ్చిన అవతార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా అప్పటి ప్రేక్షకులని మెస్మరైజ్ చేసి భారీ విజయం సాధించింది. అప్పట్లోనే అద్భుతమైన విజువల్స్ తో పండోరా అనే గ్రహాన్ని, కొత్త భాషని సృష్టించి దర్శకుడు జేమ్స్ కామెరూన్ అందర్నీ మాయ చేశాడు. ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకి పార్ట్ 2 రాబోతుంది. అవతార్:ది వే ఆఫ్ వాటర్ అనే పేరుతో ఈ సినిమా డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు అవతార్ 2 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 2డీ, 3డీ, 4డీఎక్స్ 3డీ, ఐమ్యాక్స్3డీ ఫార్మట్లలో అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమాని రిలీజ్ చేయనున్నారు. మన దేశంలో హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అయితే ఈ సినిమా టికెట్ రేట్లు చూస్తూ అంతా వామ్మో అనుకుంటున్నారు.

Kantara : 50 రోజుల తర్వాత కూడా అదరగొడుతున్న కాంతార.. 400 కోట్లు కొల్లగొట్టిందిగా..

ఒక్కో సిటీలో ఒక్కో రేటు, ఒక్కో ఫార్మేట్ కి ఒక్కో రేటు ఉండటమే కాకుండా సాధారణ సినిమాల కంటే కూడా చాలా ఎక్కువగా ఈ సినిమా టికెట్ ధర ఉండటంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. భారతదేశం ముఖ్య నగరాల్లో అవతార్ ది వే ఆఫ్ వాటర్ టికెట్ల రేట్లు ఈ విధంగా ఉన్నాయి.

హైదరాబాద్ లో 4డీఎక్స్ ఫార్మెట్ లో టికెట్ ధర రూ. 350
బెంగళూరులో ఐమ్యాక్స్ ప్రీమియం సీట్ల ధర రూ. 1500, 3డీ ప్రీమియం రూ.1650
ముంబయిలో 4డీఎక్స్ 3డీ ఫార్మెట్ లో గరిష్టంగా రూ.1700, కనిష్టంగా రూ.740
ఢిల్లీలో ఐమ్యాక్స్ 3డీ ఫార్మేట్ లో రూ. 1000
కలకత్తాలో ఐమ్యాక్స్ 3డీ ఫార్మేట్ లో రూ. 800
అహ్మదాబాద్ లో ఐమ్యాక్స్ 3డీ ఫార్మేట్ లో రూ.750
చండీగడ్ లో 4డీఎక్స్ 3డీ ఫార్మెట్ లో రూ.400
పూణెలో 4డీఎక్స్ 3డీ ఫార్మెట్ లో రూ.900 ఉన్నాయి. మరి కొన్ని నగరాల్లో ఇంకా బుకింగ్స్ ఓపెన్ చేయాల్సి ఉంది. దీంతో ఈ టికెట్ రేట్లు చూసి సినీ ప్రేక్షకులు బెంబేలెత్తుతున్నారు. ఇలా అయితే సాధారణ ప్రజలు అవతార్ సినిమా చూస్తారా అని అంటున్నారు.