Zareen Khan: ముద్దు సీన్ ముందే రిహార్సల్స్ చేద్దామా.. హీరోయిన్ మీటూ అనుభవం!

సౌత్, నార్త్ అని లేకుండా ముందు మీటూ తర్వాత క్యాస్టింగ్ కౌంచ్ అంశాలు భారత సినిమా రంగాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఇప్పటికీ వీటి వలన బడా బడా స్టార్ హీరోలకు కూడా సెగ తప్పడం లేదు.

Zareen Khan: ముద్దు సీన్ ముందే రిహార్సల్స్ చేద్దామా.. హీరోయిన్ మీటూ అనుభవం!

Zareen Khan

Updated On : June 5, 2021 / 1:18 PM IST

Zareen Khan: సౌత్, నార్త్ అని లేకుండా ముందు మీటూ తర్వాత క్యాస్టింగ్ కౌంచ్ అంశాలు భారత సినిమా రంగాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఇప్పటికీ వీటి వలన బడా బడా స్టార్ హీరోలకు కూడా సెగ తప్పడం లేదు. తాజాగా విడుదలైన సల్మాన్ ఖాన్ రాధే సినిమాను బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగిందంటే ఈ ఉద్యమాలు బలంగా నాటుకుపోయాయో అర్ధం చేసుకోవచ్చు. ఇక మీటూ కూడా అంతే.

హీరోయిన్స్ నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ వరకు వారి వేధింపుల అనుభవాలను సమయం వచ్చినపుడు చెప్పేస్తున్నారు. బాలీవుడ్ లో ఇది మరికాస్త ఎక్కువగా ఉంటుందని కొందరు చెప్పగా తాజాగా హీరోయిన్ జరీన్ ఖాన్ కూడా తనకు జరిగిన వేధింపుల గురించి చెప్పింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కెరీర్ మొద‌ట్లో నేను చాలా ఇబ్బందులు ఎదుర్కోన్నానని.. అలా ఇబ్బంది పెట్టిన వారి పేర్ల‌ను ఇప్పుడు ఇలా బ‌య‌ట పెట్టాల‌ని అనుకోవ‌డం లేదని చెప్పింది.

ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో ఓ వ్య‌క్తి ముందు చాలా అమాయాకంగా న‌టిస్తూ.. అత‌ని సినిమాలో న‌టించే అవ‌కాశం కూడా ఇప్పిస్తాన‌ని అన్నాడు. ఒకరోజు తన సినిమాలో ముద్దు సీన్ ఒకటి ఉందని.. దానిని ముందుగానే రిహార్సల్స్ చేద్దామని అసభ్యంగా ప్రవర్తించాడని.. స్నేహితుల క‌న్నా ఎక్కువ‌గా ఉందామని.. మనసులో భయాన్ని పక్కనపెట్టాలని మరో దర్శకుడు తనతో దారుణంగా ప్రవర్తించాడని జరీనా తనకు జరిగిన ఒకనాటి వేధింపులను గుర్తుచేసుకుంది. జరీనా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో బాలీవుడ్ హాట్ టాపిక్ అవుతుంది.