Gifts Taj Mahal to wife : మరో షాజహాన్..భార్యకు తాజ్‌మహల్‌ కట్టి గిఫ్టు

ఓ భర్త తన భార్యపై ఉన్న ప్రేమను ‘వాహ్..తాజ్’అని చూపించాడు.భార్య కోసం ఏకంగా తాజ్‌మహల్‌‘లాంటి’ ఇల్లు కట్టి గిప్టుగా ఇచ్చాడు.

Gifts Taj Mahal To Wife

Man gifts Taj Mahal like home to wife : భార్య అంటే ప్రేమ ఉన్నవారు ‘ప్రెస్టేజ్’ని ఎలా కాదనగలరు..అన్నట్లుగా ఓ భర్త తన భార్య మీద ఉన్న ప్రేమను వెరైటీగా చూపించాడు.దాన్ని కాస్ట్లీ అనుకోవచ్చు..ప్రెస్టేజ్ కోసం అని కూడా అనుకోవచ్చేమో..ఎవరు ఎలా అనుకున్నా ఫరవాలేదు..నా భార్య కోసం నేనిది కట్టించాను అంటున్నాడో భర్త. భార్య కోసం ఏకంగా తాజ్‌మహల్‌‘లాంటి’ ఇల్లు కట్టి గిప్టుగా ఇచ్చాడు. తాజ్‌మహల్‌ అంటే అదొక సమాధి అని ఎవ్వరు అనుకోరు.ప్రేమకు చిహ్నంగానే భావిస్తారు. అలా ఓ వ్యక్తి తన భార్యమీదున్న ప్రేమను చూపించుకోవటానికి తాజ్‌మహల్‌లాంటి ఇల్లు కట్టి గిప్టు ఇచ్చాడు. భర్త ఇచ్చిన గిప్టు చూసిన ఆ భార్య తెగ మురిసిపోయింది. నా భర్త బంగారు కొండ కాదు కాదు ‘తాజ్ మహారాజ్’ అంటూ తెగ ఉబ్బి తబ్బిబ్బు అయిపోయింది.

మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో ఓ భర్త తన భార్య కోసం కట్టిన ఈ తాజ్‌మహల్‌లాంటి ఇల్లు వైరల్ గా మారింది. షాజహాన్ భార్య ముంతాజ్ బుర్హాన్‌పూర్‌లోనే మరణించారు. దీంతో సదరు భర్త కూడా బుర్హాన్ లోనే తన భార్య కోసం తాజ్ మహల్ లాంటి ఇల్లు బుర్హాన్ లోనే కట్టించాడు. కాగా షాజహాన్ తాజ్‌మహల్‌ను తపతి నది ఒడ్డున నిర్మించాలని అనుకుని ఆ తరువాత ఎందుకో గానీ ఆగ్రాలో సరయు నది ఒడ్డున నిర్మించారు.

Read more : 139 ఏళ్ల నాటి ఇల్లు..పునాదులతో సహా గాల్లో లేచి అర కిలోమీటరు ప్రయాణం..!!

ఇప్పుడు ఆగ్రాకు చెందిన మరో షాజహాన్ లాంటి భర్త తన భార్య కోసం తాజ్ మహల్ లాంటి ఇల్లు కట్టించేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఆగ్రాకు చెందిన ఆనంద్ చోక్సీ తాజ్‌మహల్‌ లాంటి ఇంటిని నిర్మించి తన భార్యకు బహుమానంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఇంజినీర్‌ను కలిసి తన మనస్సులోని మాట చెప్పాడు.

అలా ఆలోచన పని మొదలు కావటానికి మూడేళ్లు పట్టింది. ఇంటి నిర్మాణంలో అదేనండీ మరో తాజ్ మహల్ నిర్మాణంలో చాలా ఇబ్బందుల్నే ఎదుర్కొన్నాడటం ఈ ఆధునిక షాజహాన్ అయినా ఆనంద్ చోక్సీ.ఇంటి లోపలి డిజైన్లను తీర్చిదిద్దటానికి బెంగాల్, ఇండోర్ నుంచి ప్రత్యేకంగా కళాకారులను పిలిపించాడు. ఇంటి డోమ్ 29 అడుగుల ఎత్తు..అచ్చంగా తాజ్‌మహల్‌లాంటి టవర్లు ఏర్పాటు చేశారు. రాజస్థాన్‌ నుంచి తెప్పించిన ‘మక్రానా’తో ఫ్లోరింగ్ చేయించారు.

Read more : ఇల్లుంటేనే పెళ్లి : పెరుగుతున్న అమ్మాయిల రిక్వైర్ మెంట్..కాంప్రమైజ్ అవుతున్న అబ్బాయిలు

ఇంటిలో ఫర్నిచర్‌ను ముంబై కళాకారులతో చేయించారు. ఇలా ఖర్చు ఎంతైనా భార్య కోసం వెనుకాడలేదు ఆనంద్ చోక్సీ. ఈ ఇంటిలో అదే నండీ ప్రేమ కానుకలో పెద్ద హాలు, పైన రెండు, కింద రెండు బెడ్రూములు, లైబ్రరీ, ధ్యానం కోసం ఓ గదిని నిర్మించారు. అంతేకాదు, తాజ్‌మహల్‌ లానే చీకటిలోనూ ఈ ఇల్లు వెలుగులు విరజిమ్మేలా లైంటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అందంగా, అద్భుతంగా నిర్మించిన ఈ తాజ్‌మహల్ ఇంటిని తన భార్యకు కానుకగా ఇవ్వడంతో ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఇప్పుడీ తాజ్‌మహల్ ఇల్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.