ఇల్లుంటేనే పెళ్లి : పెరుగుతున్న అమ్మాయిల రిక్వైర్ మెంట్..కాంప్రమైజ్ అవుతున్న అబ్బాయిలు

  • Published By: nagamani ,Published On : November 12, 2020 / 03:53 PM IST
ఇల్లుంటేనే పెళ్లి : పెరుగుతున్న అమ్మాయిల రిక్వైర్ మెంట్..కాంప్రమైజ్ అవుతున్న అబ్బాయిలు

Updated On : November 12, 2020 / 3:54 PM IST

Hyderabad city own house marriage bride requirements : పెళ్లి విషయంలో అమ్మాయిలు, అబ్బాయిల విషయంలో జరుగుతున్న పరిణామాల గురించి హైదరాబాద్ లోని పలు మ్యారేజ్  బ్యూరో లు పలు ఆసక్తికర విషయాలు తెలిపాయి. పెళ్లి కాని ప్రసాదులు పెరుగుతుండటంతో పెళ్లి కావాల్సిన అమ్మాయి అభిప్రాయాలు (రిక్వైర్ మెంట్స్ విషయంలో) మారుతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా సొంత ఇల్లు విషయంలో అమ్మాయిలు ఏమాత్రం రాజీ పడటంలేదని తెలిపాయి మ్యారేజ్ బ్యూరోలు.

 

పెళ్లి కావాల్సిన అమ్మాయిల రిక్వైర్ మెంట్స్  పరిస్థితులకు అనుగుణంగా మారుతున్నాయి. గతంలో బాగా సంపాదించి చక్కగా సెటిల్ అయిన అమ్మాయి కావాలనుకునేవారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో నగరాల్లో జీవించాలంటే ఓ సొంత ఇల్లన్నా కావాలనుకుంటున్నారు. అందులోను ఉద్యోగం చేసే అమ్మాయిలైతే భర్తకు మంచి సంపాదనతో పాటు సొంత ఇల్లు కచ్చితంగా ఉండాలని ఆశపడుతున్నారు. అదీకూడా హైదరాబాద్ వంటి నగరాల్లో. దీంతో అటువంటి అబ్బాయి దొరికేవరకూ వేచి చూస్తున్నారు. లేట్ అయినా ఫరవాలేదు..తమకు కావాల్సినవి ఇవ్వగలిగే అబ్బాయి కోసం వేచి చూస్తున్నారు.



పెరుగుతున్న పెళ్లికాని ప్రసాదులు..పెరుగుతున్న అమ్మాయిల డిమాండులు
అమ్మాయి కోరికలు..అవరసరాలు..డిమాండ్స్ ఇలా ఉంటే మరోపక్క అబ్బాయిలు మాత్రం పెళ్లి అయితే చాలు అన్నట్లుగా కాంప్రమైజ్ కు అలవాటు పడిపోతున్నారు. అమ్మాయి ఎన్ని కోరికలు కోరినా..ఎన్ని ఆంక్షలు పెట్టినా..ఒప్పుకుంటున్నారు. హైదరాబాద్ లో సెటిల్ అవ్వాలనుకుంటే మాత్రం కచ్చితంగా గ్యారెంటీ ఉద్యోగంతో పాటు సొంత ఇల్లు కావాలనుకుంటున్నారు అమ్మాయిలు.ముఖ్యంగా ఈ కరోనా సమయంలో ఉద్యోగం చాలా చాలా అవసరం కూడా.



పెళ్లి కావటం లేట్ అయినా ఫరవాలా సొంత ఇల్లుఉండాల్సిందే
అలాగే సొంతిల్లు కచ్చితంగా ఉండాలని ఫిక్స్‌ అవుతున్నారు అమ్మాయిలు. హైదరాబాద్ లో సాఫ్ట వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్న ఓ యువతి తన పెళ్లి విషయంలో లేట్ అయినా ఫరవాలేదు సొంత ఇల్లు ఉన్నవాడే కావాలంటోంది. అద్దె ఇళ్లల్లో ఇబ్బందులు పడడం, ఇంటి ఓనర్లు ఆంక్షలతో ఇప్పటివరకూ అలసిపోయిన ఆ అమ్మాయి సొంత ఇల్లున్నవాడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. హైదరాబాద్ నగరంలోని చాలామంది అమ్మాయిల రిక్వైర్‌మెంట్‌ జాబితాలో సొంతిల్లు తప్పనిసరిగా మారింది. ఈక్రమంలో నవంబర్ 19న ప్రారంభమయ్యే ముహుర్తానికి కనీసం 20 వేల వివాహాలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా వివాహ వేదికలూ సిద్ధమవుతున్నాయి.



అమ్మాయిల రిక్వైర్‌మెంట్స్‌..కాంప్రమైజ్ అవుతున్న అబ్బాయిలు
కాగా..అమ్మాయిల రిక్వైర్‌మెంట్స్‌ ముందు చాలామంది అబ్బాయిలు నిలబడ లేకపోతున్నారు. బేజారెత్తిపోతున్నారు. ఫలితంగా కొందరు ఒంటరి పక్షిగానే పెళ్లికాని ప్రసాదుల్లా మిగిలిపోతున్నారు. 100 సంబంధాలు చూస్తే ఐదారే కుదురుతున్నాయని హైదరాబాద్ లోని ఓ మ్యారేజ్‌ బ్యూరో నిర్వాహకుడు తెలిపారు. కొన్ని విషయాల్లో పేరేంట్స్‌ తగ్గినా, అమ్మాయిలు కాంప్రమైజ్‌ అవడం లేదని..ముఖ్యంగా అబ్బాయికి సొంతిల్లు ఉంటేనే పెళ్లికి ఓకే చెప్తున్నారని తెలిపారు. కరోనా కారణంగా మ్యారేజీ బ్యూరో బిజినెస్‌ 80 శాతం పడిపోగా, ఇప్పుడిప్పుడే మళ్లీ పెళ్లిడ్లి సంబంధాల కోసం వస్తున్నవారు పెరుగుతున్నారని వివరించారు.


అమ్మాయిల్ని పెళ్లికి ఒప్పించటం కష్టమవుతోంది
ఇప్పుడు అమ్మాయిలకు పెళ్లి కొడుకును సెలెక్ట్ చేసుకోవటంలో చాలా క్లారిటీగా ఉంటున్నారు. వాళ్లను పెళ్లికి ఒప్పించాలంటే చాలా కష్టమవుతోంది. వాళ్లు చాలా రిక్వైర్‌మెంట్స్‌తో ఉంటున్నారు. ఒక అమ్మాయికి పెళ్లి కుదరాలంటే మినిమమ్ 30 నుంచి 40 సంబంధాలు చూడాల్సి వస్తోంది. ఎక్కువమంది అమ్మాయిలు సొంతిల్లు ఉన్న అబ్బాయికి ప్రాధాన్యమిస్తున్నారు. ఒకప్పుడు పెళ్లి కొడుకు అందంగా ఉండాలని..ఆస్తిఉండాలని కోరుకునేవారు. ఇప్పుడు అందానికి ప్రాధాన్యత లేదు. వయస్సు విషయంలో కూడా పెద్దగా అభ్యంతరాలు ఉండటంలేదు. సొంతిల్లు ఉన్న సంబంధాలే చూడాలని కచ్చితంగా చెప్తున్నారని మ్యారేజ్‌ బ్యూరో డైరెక్టర్‌ కీసర మంజులగౌడ్‌, తెలిపారు.

ఇల్లుంటే జీతం తక్కువైనా పెళ్లికి ఓకే అంటున్నా అమ్మాయిలు
నెలకు లక్ష రూపాయలు జీతం ఉన్నా.. సిటీలో సొంతిల్లు లేకుంటే అమ్మాయిలు పట్టించుకోవడం లేదు. ఆ ఉద్యోగంపై వారికి పెద్దగా నమ్మకం కుదరడం లేదు. కరోనా పరిస్థితుల్లో అనేకమంది ఉద్యోగాలు పోగొట్టుకోవటంతో ఉద్యోగం పోయినా మరో ఉద్యోగం వెతుక్కోవచ్చు..కానీ సొంతిల్లు ఉంటే జీతం తక్కువయినా ఓకే చెప్తున్నారని తెలిపారు. కొవిడ్‌ పెళ్లి సంబంధాలను వాయిదా వేయగలిగింది కానీ అమ్మాయిల రిక్వైర్‌మెంట్స్‌లో మార్పులు మాత్రం తీసుకురాలేదని తెలిపారు. తమకు నచ్చిన వరుడు దొరికే దాకా లేట్ అయినా ఫరవాలేదంటున్నారని మరో మ్యారేజ్ బ్యూరో డైరెక్టర్ తెలిపారు.


పెళ్లి విషయంలో రాజీ పడని అమ్మాయిలు..
గతంలో మాకు అమ్మాయి నచ్చలేదని పెళ్లికొడుకు వారి తరపు బంధువులు చెప్పేవారు. కానీ ఇప్పుడు పెళ్లి చూపుల్లోనైనా అమ్మాయిలే రిజెక్ట్‌ చేయడమే ఎక్కువగా ఉంటోంది. అబ్బాయిలకు రెండు, మూడు సంబంధాలు చూపిస్తే చాలు అమ్మాయి అందంగా లేకపోయినా..ఓకే చెప్పేస్తున్నారు. అబ్బాయిలు వయస్సు పెరుగుతున్న కొద్దీ డిమాండ్లు తగ్గించుకుంటున్నారు. కానీ అమ్మాయిలు మాత్రం ఏమాత్రం రాజీ పడటం లేదని మ్యారేజ్ బ్యూరో డైరెక్టర్ తెలిపారు.