×
Ad

Maharashtra : కోవిడ్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం..10కి చేరిన మృతుల సంఖ్య

మహారాష్ట్రలో ఓ సివిల్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని కోవిడ్ బాధితులు చికిత్స పొందుతున్న ఐసీయూలో యూనిట్లో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి పెరిగింది.

  • Published On : November 6, 2021 / 02:50 PM IST

Ahmednagar Civil Hospital

Ahmednagar Civil Hospital : మహారాష్ట్రలో కోవిడ్ బాధితులు చికిత్స పొందుతున్న ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలోని ఐసీయూలో యూనిట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఘటనలో మృతుల సంఖ్య 10కి పెరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆరుగురు కరోనా బాధితులు అక్కడిక్కడే మంటల్లో సజీవదహనమవ్వగా..మరో 11మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఈక్రమంలో మరో నలుగురు మృతి చెందటంతో మృతుల సంఖ్య 10కి పెరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని సమాచారం. ప్రమాదం జరిగిన సమయానికి ఐసీయూలో 17 మంది రోగులు చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదం ఘటన వివరాల్లోకి వెళితే..అహ్మద్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రి ఐసీయూ వార్డులో ఉదయం 11.30 గంటల సమయంలో ప్రమాదం సంభవించింది. ఆస్పత్రి కింది అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదఘటనపై సమాచారం అందిన వెంటనే అధికారులు, అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Read more : Maharashtra : ఐసీయూలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురు కరోనా బాధితులు సజీవదహనం

అగ్నిప్రమాదం తీవ్రగా భారీగా ఉండటం..కరోనా బాధితుల తీవ్రంగా గాయడపడటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 20 మందిని బాధితులను మరొక ఆస్పత్రికి తరలించామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మంటల్లో కనీసం 12 నుంచి 15 మంది గాయపడి ఉంటారని.. ఆరుగురు సజీవ దహనం కాగా..గాయపడినవారు చికిత్స పొందుతు మరో నలుగురు మరణించటంతో ఇప్పటి వరకు అందిన సమచారం ప్రకారం మృతుల సంఖ్య 10కి పెరిగింది.

ప్రమాద ఘటనపై స్పందించిన అహ్మద్‌నగర్ గార్డియన్ మంత్రి హసన్ ముష్రిఫ్ కొల్హాపూర్ నుంచి వెంటనే నగరానికి బయలుదేరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హసన్ ముష్రిఫ్ తెలిపారు. హసన్ ముష్రిఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు వరకు మృతి చెందారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయని భావిస్తున్నారు. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలిస్తామని హసన్ ముష్రిఫ్ తెలిపారు. అలాగే మృతుల బంధువులకు తక్షణ సాయం అందజేస్తామని స్పష్టం చేశారు.