Maharashtra : ఐసీయూలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురు కరోనా బాధితులు సజీవదహనం
మహారాష్ట్రలో ఓ సివిల్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని ఐసీయూలో యూనిట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు కరోనా బాధితులు సజీవదహనమయ్యారు.

Fire Broke Out In Ahmednagar Civil Hospital, Maharashtra, 5 People Died In This Fire In Icu
Ahmednagar Civil Hospital : మహారాష్ట్రలో ఓ సివిల్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని ఐసీయూలో యూనిట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు కరోనా బాధితులు సజీవదహనమయ్యారు. మరికొంతమందికి తీవ్రగాయాలు అయ్యాయి. అహ్మద్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రి ఐసీయూ వార్డులో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ఉదయం 11.30 గంటల సమయంలో ఆస్పత్రి కింది అంతస్తులో మంటలు చెలరేగాయి. కరోనా వార్డులో ఈ అగ్నిప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. ప్రమాద సమయంలో వార్డులో 17 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. సమాచారం అందిన వెంటనే అధికారులు, అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 20 మందిని బాధితులను మరొక ఆస్పత్రికి తరలించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మంటల్లో కనీసం 12 నుంచి 15 మంది గాయపడి ఉంటారని, ఆరుగురు మరణించారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.
ప్రమాద ఘటనపై స్పందించిన అహ్మద్‌నగర్ గార్డియన్ మంత్రి హసన్ ముష్రిఫ్ కొల్హాపూర్ నుంచి వెంటనే నగరానికి బయలుదేరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హసన్ ముష్రిఫ్ తెలిపారు. హసన్ ముష్రిఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు వరకు మృతి చెందారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయని భావిస్తున్నారు. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలిస్తామని హసన్ ముష్రిఫ్ తెలిపారు. అలాగే మృతుల బంధువులకు తక్షణ సాయం అందజేస్తామని స్పష్టం చేశారు.
Read Also : Karthik Kumar Reddy Died : మనాలిలో విరిగిపడ్డ మంచు చరియలు..ఏపీకి చెందిన జవాన్ మృతి