sarkaru vaari paata
Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మహేష్ మరోసారి బాక్సాఫీస్‌పై తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌తో కనిపిస్తుండటంతో ఈ సినిమా కూడా గతంలో మహేష్ నటించిన ‘పోకిరి’లాగా సక్సెస్ అవుతుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఆ సినిమాలో కూడా మహేష్ అదే తరహా లుక్‌తో కనిపించడమే దీనికి కారణంగా వారు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్‌లో ‘సర్కారు వారి పాట’ సినిమాలో దమ్ముంటేనే ఈ సినిమా హిట్ అయ్యే అవకాశం ఉందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
కాగా ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉండగా, ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ గ్లింప్స్ అండ్ ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘కళావతి’ శ్రోతలను కట్టిపడేసిందని చెప్పాలి. అనంత్ శ్రీరామ్ అందించిన అద్భుతమైన లిరిక్స్‌కు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అత్యద్భుతంగా కుదరగా, సిద్ శ్రీరామ్ ఈ పాటను చాలా అందంగా ఆలపించాడు. దీంతో ఈ పాట కేవలం క్లాస్ ఆడియెన్స్‌నే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. కాగా ఈ పాటలో మహేష్ తన లుక్స్‌తో అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టాడని చెప్పాలి.
Sarkaru Vaari Paata: క్లైమాక్స్‌కు చేరిన సర్కారు షూటింగ్.. నెక్స్ట్ రచ్చ మహేష్‌దే!
ఇక ఈ క్లాసిక్ పాటకు మహేష్ వేసిన స్టెప్స్ మరో హైలైట్‌గా నిలిచాయి. ఈ పాట రిలీజ్ అయిన రోజునే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. కాగా ఈ పాట రాను రాను ప్రేక్షకుల్లో మరింత క్రేజ్‌ను దక్కించుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక కళావతి పాటకు కామన్ ఆడియన్స్ నుండి సెలబ్రిటీల వరకు అందరూ కూడా రీల్స్ చేస్తూ తమదైన గుర్తింపు దక్కించుకున్నారు. ఈ పాటలో కీర్తి సురేష్ కూడా చాలా అందంగా కనిపించడంతో ఆమె అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుండి కేవలం కళావతి అనే ఒకేఒక సాంగ్ రిలీజ్ అయ్యింది. కానీ ఈ పాట అప్పుడే 100 మిలియన్ వ్యూస్ దిశగా పయనిస్తోంది.
Sarkaru Vaari Paata : ‘కళావతి’ పాటకి తమన్ స్టెప్పులు.. అదరగొట్టావంటూ మహేష్ అభిమానులు..
కళావతి సాంగ్‌ను వాలెంటైన్స్ రోజు కానుకగా ఫిబ్రవరి 13న రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కాగా ఇప్పటివరకు ఈ పాటకు దాదాపు 90 మిలియన్ వ్యూస్ రాగా, ఈ సినిమా నుండి రెండో పాట రిలీజ్ అయ్యేలోపు ఇది ఏకంగా 100 మిలియన్ వ్యూస్‌ను కూడా దక్కించుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. మరి ఈ సినిమాలోని సెకండ్ సాంగ్ రిలీజ్ అయ్యేసరికి కళావతి ఇంకా ఎలాంటి రికార్డులను దక్కించుకుంటుందా అని మహేష్ అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.