Samyuktha Menon : టాలీవుడ్ హీరోలపై సంయుక్త మీనన్ కామెంట్స్.. ఏ హీరో గురించి ఏం చెప్పింది..?

భీమ్లా నాయక్ సినిమాలో రానా సరసన నటించి తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది మలయాళ భామ సంయుక్త మీనన్. ఈ సినిమా తర్వాత వరుస తెలుగు సినిమాల్లో నటిస్తుంది. తాజాగా కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో...........

Samyuktha Menon : టాలీవుడ్ హీరోలపై సంయుక్త మీనన్ కామెంట్స్.. ఏ హీరో గురించి ఏం చెప్పింది..?

Updated On : August 5, 2022 / 1:00 PM IST

Samyuktha Menon : పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమాలో రానా సరసన నటించి తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది మలయాళ భామ సంయుక్త మీనన్. ఈ సినిమా తర్వాత వరుస తెలుగు సినిమాల్లో నటిస్తుంది. తాజాగా కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకి రాబోతుంది సంయుక్త. నేడు ఆగస్టు 5న బింబిసార సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని పంచుకున్న సంయుక్త మీనన్ టాలీవుడ్ హీరోల గురించి కూడా మాట్లాడింది.

Dulquer Salmaan : మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కి భీమవరంలో భారీ కటౌట్..

కళ్యాణ్ రామ్ గురించి చెప్తూ బింబిసారలో హీరో కళ్యాణ్ రామ్ ప్రాణం పెట్టి నటించారని తెలిపింది. బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తారక్ తో మాట్లాడానని, ఆయన నటనా ప్రావిణ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అని, అది ఆయనకి కూడా చెప్పాను అని, RRR సినిమా రెండు సార్లు చూశానని చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పడం కష్టం, ఆయన చాలా మందికి ఇన్స్పిరేషన్ అని తెలిపారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కూడా మాట్లాడుతూ మహేష్ ఎల్లప్పుడూ ప్రకాశించే రాక్ స్టార్ లాంటి వారు, ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలి, అయన పక్కన సినిమా ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాను అని తెలిపింది.