Mamata Banerjee Workout: ట్రెడ్ మిల్‌పై కుక్కపిల్లతో మమతా బెనర్జీ వర్కౌట్లు.. అదనపు ప్రేరణ కావాలంటూ ట్వీట్..
మమతా బెనర్జీ పవర్ ఫుల్ రాజకీయ నాయకురాలు. ఇటు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే అటు ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు వహిస్తారు. "ఒక్కోసారి మనకు అదనపు ప్రేరణ అవసరం" అంటూ మమతా బెనర్జీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
- Lakshmi 10tv
- Published On : May 13, 2023 / 12:58 PM IST
Mamata Banerjee's Workout Routine
Mamata Banerjee’s workout video goes viral : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎప్పుడూ బిజీగా ఉంటారు. ప్రత్యర్ధి పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలుస్తారు. ఇదంతా ఓవైపు. ఇక ఖాళీ సమయం దొరికినపుడో? వారాంతంలోనో ఏం చేస్తారు? అంటే స్వయంగా ఆవిడ పోస్ట్ చేసిన వీడియో చూస్తే అర్ధమవుతుంది.
Amartya Sen: ప్రధాని అభ్యర్థి మమతా బెనర్జీ అయితే బెటర్.. నోబెల్ గ్రహీత అమర్త్యసేన్
మమతా బెనర్జీ ఐదు దశాబ్దాలుగా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న 68 ఏళ్ల మమతా బెనర్జీ ఎప్పుడూ ఇంత యాక్టివ్ గా ఎలా ఉంటారు? అంటే ఖాళీ సమయం దొరికినపుడు లేదా వారాంతంలో ట్రెడ్ మిల్ మీద వాక్ చేస్తారు. తాజాగా గోధుమరంగు కుక్కపిల్లతో తాను ట్రెడ్ మిల్ మీద నడుస్తున్న వీడియోను మమతా బెనర్జీ తన అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. “ఒక్కోసారి అదనంగా శక్తి, ప్రేరణ కావాలి” అనే క్యాప్షన్ తో మమతా బెనర్జీ పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Karnataka elections 2023: కర్ణాటక ప్రజలకు మమతా బెనర్జీ సందేశం
మమతా బెనర్జీ సమయం దొరికితే ఎక్కువగా వ్యాయామానికి సమయం కేటాయిస్తారు. 2019లో వ్యాయామంపై అవగాహన కల్పించడానికి డార్జిలింగ్ లో నిర్వహించిన 10 కిలోమీటర్ల వాక్ లో మమతా పాల్గొన్నారు.
