Karnataka elections 2023: కర్ణాటక ప్రజలకు మమతా బెనర్జీ సందేశం

Karnataka elections 2023: ఇది కర్ణాటక ప్రజలకు తాను చేస్తోన్న విన్నపమని మమతా బెనర్జీ చెప్పారు.

Karnataka elections 2023: కర్ణాటక ప్రజలకు మమతా బెనర్జీ సందేశం

Karnataka elections 2023

Karnataka elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగుస్తున్న వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆ రాష్ట్ర ప్రజలకు ఓ సందేశాన్ని ఇచ్చారు. “స్థిరత్వం, అభివృద్ధి కోసం ఓటు వేయండి.. అంతేగానీ, బీజేపీకి ఓటు వేయొద్దు” అని ఆమె అన్నారు. ఇది కర్ణాటక ప్రజలకు తాను చేస్తోన్న విన్నపమని చెప్పారు. బీజేపీ చాలా ప్రమాదకరమని మమతా బెనర్జీ అన్నారు.

మణిపూర్ లో నెలకొన్న పరిస్థితులను కూడా ప్రస్తావిస్తూ బీజేపీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్ లో ఏదైనా జరిగితే వందలాది కేంద్ర బృందాలను రాష్ట్రానికి పంపుతారని, తమ ప్రభుత్వ ప్రతిష్ఠ తీయడానికి ప్రయత్నాలు జరుపుతారని మమతా బెనర్జీ అన్నారు.

బీజేపీ అధికారంలో ఉన్న మణిపూర్ లో మాత్రం అటువంటి ప్రయత్నాలు ఏమీ జరగడం లేదని చెప్పారు. కానీ, నిజాలు ఏంటో ప్రజలకు తెలుసని అన్నారు. మణిపూర్ లో జరుగుతోన్న హింసలో, కనిపిస్తే కాల్చివేత చర్యల్లో ఎంతమంది చనిపోయారో మనకు తెలియదని చెప్పారు. మణిపూర్ ప్రభుత్వం ఆ లెక్కలు చెప్పడం లేదని అన్నారు. దాదాపు 60-70 మంది మృతి చెందినట్లు తనకు తెలుస్తోందని చెప్పారు.

కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా ర్యాలీలు నిర్వహించాయి. బజరంగ్ దళ్, 40 శాతం కమీషన్, టిప్పు సుల్తాన్ వంటి అంశాలపై మాటల యుద్ధం జరిగింది.

Karnataka elections 2023: సోనియా గాంధీపై చర్యలు తీసుకోవాలి: ఈసీకి బీజేపీ ఫిర్యాదు