Mamta Mohandas : క్యాన్సర్ వస్తే ఇలా ఉంటానా.. ఫేక్ వార్తలకి గట్టింగా కౌంటర్ ఇచ్చిన హీరోయిన్..

తెలుగు, తమిళ్, మలయాళంలో హీరోయిన్ గా, సెకండ్ హీరోయిన్ గా పలు సినిమాలు చేసిన మమతా మోహన్ దాస్ కొంతకాలం క్రితం క్యాన్సర్ బారిన పడి కోలుకుంది. తాను క్యాన్సర్ బారిన పడ్డట్టు.................

Mamta Mohandas gives counter to fake news about her health

Mamta Mohandas :  తెలుగు, తమిళ్, మలయాళంలో హీరోయిన్ గా, సెకండ్ హీరోయిన్ గా పలు సినిమాలు చేసిన మమతా మోహన్ దాస్ కొంతకాలం క్రితం క్యాన్సర్ బారిన పడి కోలుకుంది. తాను క్యాన్సర్ బారిన పడ్డట్టు, తాను ఎలా ఉంది, తాను క్యాన్సర్ నుంచి రికవర్ అయినట్టు.. అన్నీ సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది మమతా. ఇటీవల మమతా మోహన్ దాస్ మళ్ళీ క్యాన్సర్ బారిన పడిందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలకి సీరియస్ గా కౌంటర్ ఇచ్చింది మమతా.

తాజాగా తన ఫోటోలని కొన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి.. ”ఇటీవల నా ఆరోగ్యం గురించి కొన్ని తప్పుడు వార్తలు రాస్తున్నారు. అలాంటి వార్తలు చూసి నా స్నేహితులు, బంధువులు ఆందోళన చెందుతూ నాకు కాల్స్ చేస్తున్నారు. నేను క్యాన్సర్ బారిన పడ్డట్టు, నా ఆరోగ్యం బాగోలేదని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ప్రసారం చేశాయి. అవన్నీ ఫేక్ వార్తలు, రూమర్లు. అలాంటి వాటిని నమ్మకండి. నేను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాను.”

Also Read This…  Allari Naresh : ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందని అనుకున్నాను.. కానీ..

”నా జీవితాన్ని ప్రస్తుతం చాలా సంతోషంగా గడుపుతున్నాను. అలాంటి ఫేక్ వార్తలు డబ్బుల కోసం, వ్యూస్ కోసం రాస్తారు. ఇలాంటి వార్తలు గతంలో కూడా చాలా చూశాను. ఇలాంటి పరిస్థితులు మీకొస్తే అప్పుడు తెలుస్తుంది. జీవితంలో ఇంకో వైపు కూడా చూడండి. వాస్తవికతకు దగ్గరగా బతకండి. అబద్దపు ప్రపంచంలో బతకకండి. నిజం తెలుసుకోవాలని ఇలాంటి వార్తలని నా దృష్టికి తీసుకువచ్చిన వాళ్లకి థ్యాంక్స్. ఇలాంటి వార్తలని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకండి. నాకు క్యాన్సర్ వస్తే ఇలా ఉంటానా? నా ఆరోగ్యం గురించి ఎలాంటి వార్త అయినా నేను చెప్తాను. ప్రస్తుతం నేనొక సినిమా కూడా చేస్తున్నాను” అని తెలిపింది.