Allari Naresh : ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందని అనుకున్నాను.. కానీ..

నవంబర్ 25న అల్లరి నరేష్ నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అల్లరి నరేష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా గురించి, తన కేరీర్ గురించి పలు విషయాలు పంచుకున్నారు...............

Allari Naresh : ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందని అనుకున్నాను.. కానీ..

Allari Naresh about his career

Allari Naresh :  ఒకప్పుడు కామెడీ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్స్ గా నిలిచిన అల్లరి నరేష్ ఆ తర్వాత వరుస ఫ్లాప్స్ ని చూశారు. ఇటీవల ‘నాంది’ అనే కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాతో వచ్చి హిట్ కొట్టారు. ఆ తర్వాత నుంచి అన్ని కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తున్నారు. అలాంటి సినిమాలే చేస్తానని అల్లరి నరేష్ తెలిపారు. ప్రస్తుతం అల్లరి నరేష్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు.

నవంబర్ 25న అల్లరి నరేష్ నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అల్లరి నరేష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా గురించి, తన కేరీర్ గురించి పలు విషయాలు పంచుకున్నారు.

Kamal Haasan : కమల్ హాసన్‌కు అస్వస్థత.. చెన్నై హాస్పిటల్‌లో చేరిక..

అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ”కెరీర్ ఆరంభంలో చేసిన ‘నేను’ అనే సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాను. ఆ సినిమా పెద్ద హిట్ అయి నా రేంజ్ మారిపోతుంది అనుకున్నాను. కానీ ఆ సినిమా ఆశించినంత ఫలితం ఇవ్వలేదు. సినిమా జిత్ అవ్వకపోయినా నేను కామెడీనే కాకుండా అలాంటి క్యారెక్టర్స్ కూడా చేయగలను అని అందరికి తెలిసింది. నాలో కూడా కాన్ఫిడెన్స్ పెంచింది. ఆ సినిమా వల్లే ‘గమ్యం’, ‘శంభో శివ శంభో’, ‘మహర్షి’ సినిమాలలో అవకాశాలు వచ్చాయి. వాటిల్లో సీరియస్ క్యారెక్టర్స్ కూడా చేయడంతోనే ‘నాంది’ కథ నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఇకపై ఎక్కువగా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తాను. జనాలు కూడా ఇప్పుడు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు”అని తెలిపారు.