Son Body On Shoulders: అంబులెన్స్ ఏర్పాటు చేయని ఆస్పత్రి.. కొడుకు శవాన్ని వర్షంలో భుజాలపైనే మోసిన తండ్రి
ప్రైవేటు అంబులెన్స్‌కు డబ్బులు చెల్లించే స్థోమత లేని ఒక వ్యక్తి కొడుకు శవాన్ని భుజాలపైనే వేసుకుని ఇంటికి బయల్దేరాడు. వర్షంలోనే దాదాపు ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాడు. చివరకు కొందరు స్థానికులు సహాయం చేశారు.
- Narender Thiru
- Published On : August 4, 2022 / 06:14 PM IST
Son Body On Shoulders: ఆసుపత్రులు, అధికారుల నిర్లక్ష్యంతో కుటుంబ సభ్యుల మృతదేహాల్ని భుజాలపైనో, సొంత వాహనాల్లోనో తీసుకెళ్తున్న హృదయ విదారక ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్‌లోని ప్రగ్యారాజ్‌లో ఇటీవల జరిగింది. డేహా గ్రామానికి చెందిన భజరంగి యాదవ్ కొడుకు శుభమ్‌కు కరెంట్ షాక్ తగిలింది.
Kerala Man: స్కేట్‌బోర్డుపై కాశ్మీర్ యాత్ర చేస్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
దీంతో తీవ్ర గాయాలపాలైన అతడ్ని ప్రగ్యారాజ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. దీంతో తన కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయమని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యాధికారులను కోరాడు. దీనికి వైద్య సిబ్బంది నిరాకరించారు. ప్రైవేటు అంబులెన్స్‌లోనే తీసుకెళ్లమని సలహా ఇచ్చారు. దీంతో ప్రైవేటు అంబులెన్స్ కోసం ప్రయత్నించాడు. వాటికి డబ్బులు చెల్లించేందుకు సరిపడా స్థోమత లేకపోవడంతో, చివరకు తన భుజాలపైనే కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్లాలనుకున్నాడు. అలా కొడుకు శవాన్ని భుజాలపైనే వేసుకుని, వర్షంలో నడవడం మొదలుపెట్టాడు. వర్షంలోనే దాదాపు ఐదు కిలోమీటర్లు నడిచాడు.
Indians Went Abroad: ఉపాధి కోసం రెండున్నరేళ్లలో విదేశాలకు 28 లక్షల మంది
తర్వాత ఒక కారు డ్రైవరు సహాయం చేయడం వల్ల కొడుకు మృతదేహంతో నివాసానికి చేరుకున్నాడు. అయితే, ఈ ఘటనను స్థానికులు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటన విషయంలో ప్రభుత్వంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ వీడియో వైరల్‌గా మారడంతో దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పింది.
