Work from theatre : ఓ వైపు సినిమా చూస్తున్నాడు.. మరోవైపు ల్యాప్‌టాప్‌లో పనిచేస్తున్నాడు.. వర్క్ ఫ్రం థియేటర్ ..

ఎక్కడ నుంచి పని చేశామా అన్నది కాదు.. పని చేశామా? లేదా? అన్నది కొత్త ట్రెండ్. బెంగళూరులో ఓ వైపు సినిమాలు చూస్తూ మరోవైపు ఆఫీసు పనులు కూడా చక్కబెట్టేసుకుంటున్నారు. వర్క్ ఫ్రం థియేటర్ అన్నమాట.

Work from theatre :  గడిచిన మూడేళ్లలో మనుష్యుల జీవనశైలిలో అనేక మార్పులు వచ్చాయి. కరోనా సృష్టించిన విలయం తరువాత లాక్ డౌన్ ఎఫెక్ట్‌తో చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం డిసైడ్ చేశాయి. ఇప్పటికీ అదే పంథాను అనుసరిస్తున్నాయి కూడా. ఎక్కడ నుంచి పని చేసామా అన్నది కాదు.. వర్క్ కంప్లీట్ చేస్తున్నామా? లేదా? అన్నట్లుగా ఉంది ప్రస్తుతం పరిస్థితి. థియేటర్‌లో సినిమాకి వెళ్లి కూడా ల్యాప్‌టాప్ లలో తమ పని పూర్తి చేస్తున్నారు కొందరు.

Bengaluru Woman: బైక్ నుంచి కిందకు దూకేసి.. తెగువ చూపిన బెంగళూరు మహిళ..

బెంగళూరు సిటీ ఎప్పుడూ కొత్తదనానికి తెరలేపుతుంది. ఇప్పుడు థియేటర్లలో సినిమాలు చూస్తూ కూడా జాబ్ చేయచ్చు అనే కొత్త మార్గాన్ని కనిపెట్టింది. ఏప్రిల్ 10న ఓ వ్యక్తి థియేటర్ లో కూర్చుని ల్యాప్‌టాప్‌లో తన పనిచేసుకోవడం కొందరు తమ కెమెరాలతో క్లిక్ మనిపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలామంది కామెంట్లు పెడుతున్నారు.

Fighting for sarees : శారీల కోసం సిగపట్లు.. బెంగళూరులో ఇద్దరు మహిళల ఫైటింగ్ వీడియో వైరల్

‘దీనిని వర్క్ ఫ్రం థియేటర్’ అంటారని కొందరు.. సినిమా టైంలో ఇలా పనిచేయడం.. ఇక మొబైల్స్ చూడటం లాంటివి పక్కవారికి చాలా డిస్ట్రబెన్స్ అని కొందరు అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు ఆఫీసుల్లో గంటల తరబడి కూర్చుని పని చేసేవాళ్లంతా వర్క ఫ్రం హోం ఫెసిలిటీతో తమకు ఎక్కడ వెసులుబాటు ఉంటే అక్కడ పని కంప్లీట్ చేయగలుగుతున్నారు. ఒక రకంగా ఒత్తిడిని తగ్గించుకుంటున్నారు అని చెప్పాలి.

ట్రెండింగ్ వార్తలు