Mangalore university: మంగళూరు యూనివర్సిటీలో ముసుగుపై నిషేధం

యూనివర్సిటీ ప్రాంగణంలో తల, ముఖం కనిపించకుండా ముసుగు ధరించడంపై నిషేధం విధించింది మంగళూరు యూనివర్సిటీ పాలకవర్గం. క్లాస్ రూమ్‌లలో, యూనివర్సిటీ క్యాంపస్‌లో ఎక్కడా ముసుగు ధరించి కనిపించకూడదని సూచించింది.

Mangalore university: యూనివర్సిటీ ప్రాంగణంలో తల, ముఖం కనిపించకుండా ముసుగు ధరించడంపై నిషేధం విధించింది మంగళూరు యూనివర్సిటీ పాలకవర్గం. క్లాస్ రూమ్‌లలో, యూనివర్సిటీ క్యాంపస్‌లో ఎక్కడా ముసుగు ధరించి కనిపించకూడదని సూచించింది. యూనివర్సిటీతోపాటు ఆరు అనుబంధ కాలేజీలలో కూడా ఈ నిబంధన వర్తిస్తుందని మంగళూరు యూనివర్సిటీ తెలిపింది.

Ambassador Car: రెండేళ్లలో మళ్లీ రానున్న అంబాసిడర్ కార్

అయితే, దీనిపై అటు విద్యార్థుల నుంచి, ఇటు అధ్యాపకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవల ముస్లిం విద్యార్థినిలు యూనిఫామ్‌కు చెందిన షాలువాతో ఫేస్ కవర్ చేసుకునేందుకు యూనివర్సిటీ అనుమతించింది. అయితే, ఈ నెల 16న జరిగిన ఒక మీటింగ్‌లో ఈ వెసలుబాటును కూడా తొలగించారు. యూనివర్సిటీ, కాలేజీ ప్రాంగణంలో ఎవరూ తలకు, ముఖానికి ఎలాంటి ముసుగు ధరించకూడదని తీర్మానం చేశారు. ప్రస్తుతం యూనివర్సిటీ కాలేజీలో 44 మంది ముస్లిం విద్యార్థినిలకుగాను, పది మంది మాత్రమే హాజరవుతున్నారని, మిగతా వాళ్లు కూడా యూనివర్సిటీకి వచ్చేందుకు చర్చలు జరుపుతున్నామని చెప్పారు. మరోవైపు విద్యార్థినిలు యూనివర్సిటీ నిర్ణయంపై మండిపడుతున్నారు. ప్రస్తుత నిబంధన కింది తరగతుల వాళ్లకు మాత్రమే అని, డిగ్రీ, పీజీ విద్యార్థులకు వర్తించదంటున్నారు.

Modi Speech: ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపుతున్న భారత్: మోదీ

అకడమిక్ ఇయర్ మధ్యలో ఇలా కొత్త నిబంధన తీసుకురావడం సరికాదని విమర్శిస్తున్నారు. ఈ నిర్ణయంపై ముస్లిం విద్యార్థి సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తుంటే, ఏబీవీపీ వంటి సంస్థలు హిజాబ్‌ను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి నిబంధనలు అకడమిక్ ఇయర్ ప్రారంభంలోనే తీసుకురావాలని, ఇలా మధ్యలో రూల్స్ పెట్టడం సరికాదని ముస్లిం విద్యార్థి సంఘాలు అంటున్నాయి.

ట్రెండింగ్ వార్తలు