Ambassador Car: రెండేళ్లలో మళ్లీ రానున్న అంబాసిడర్ కార్

దేశంలో ఎన్ని మోడల్ కార్లు అందుబాటులోకి వచ్చినా.. ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచేది అంబాసిడర్ కార్ మాత్రమే. ‘కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్’గా పిలిచే ఈ కారును ఇష్టపడేవాళ్లు ఇప్పటికీ బోలెడంత మంది.

Ambassador Car: రెండేళ్లలో మళ్లీ రానున్న అంబాసిడర్ కార్

Ambassador Car

Ambassador Car: దేశంలో ఎన్ని మోడల్ కార్లు అందుబాటులోకి వచ్చినా.. ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచేది అంబాసిడర్ కార్ మాత్రమే. ‘కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్’గా పిలిచే ఈ కారును ఇష్టపడేవాళ్లు ఇప్పటికీ బోలెడంత మంది. అయితే, 2014 నుంచి ఈ కారు తయారీ ఆగిపోయింది. అప్పట్నుంచి కొత్త కార్లు రాలేదు. కానీ, ఇప్పుడు సరికొత్త రీతిలో మార్కెట్లోకి వచ్చేందుకు సిద్దమవుతోంది అంబాసిడర్.

Modi Tour: మోదీ చెన్నై పర్యటన.. నిధులు విడుదల చేయాలని సీఎం డిమాండ్

సరికొత్త లుక్‌తో అంబాసిడర్ 2.0 రెండేళ్లలో మార్కెట్లోకి వస్తుందని ప్రకటించింది తయారీ సంస్థ అయిన హిందుస్థాన్ మోటార్స్. ఫ్రాన్స్‌కు చెందిన ప్యూజట్ అనే కార్ల తయారీ సంస్థతో కలిసి, సంయుక్తంగా అంబాసిడర్ కొత్త వెర్షన్ డెవలప్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. చెన్నైలోని హిందుస్తాన్ మోటార్స్ ప్లాంటులో కొత్త కార్ల తయారీ జరగనుంది. బ్రిటీష్ కార్ల తయారీ సంస్థ అయిన మోరిస్ ఆక్స్‌ఫర్డ్ సిరీస్-3 ఆధారంగా ఈ కారును తయారు చేశారు. 1956 నుంచి దేశంలో ఈ కార్లు తయారవుతుండేవి. బ్రిటీష్ మోడల్ కార్ ఆధారంగా తయారైనప్పటికీ, దీన్ని ఇండియన్ కారుగానే చూస్తారు. 1960-90 వరకు అంబాసిడర్ కారు కలిగి ఉండటాన్ని స్టేటస్ సింబల్‌గా చూసేవాళ్లు. ఎన్ని కొత్త మోడల్స్ మార్కెట్లోకి వచ్చినా, ఆ సమయంలో దీనికున్న క్రేజ్ తగ్గలేదు. అయితే, ఆ తర్వాత క్రమంగా కార్ల అమ్మకాలు తగ్గాయి.

Modi Speech: ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపుతున్న భారత్: మోదీ

దీంతో హిందుస్తాన్ మోటార్స్ సంస్థ నష్టాల్లో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో 2014 నుంచి కార్ల తయారీ, అమ్మకాలు నిలిపివేసింది. 2017లో కంపెనీలోని వాటాలను ప్యూజట్ సంస్థకు అమ్మేసింది. ఇప్పుడు ఈ రెండు సంస్థలు కలిసి కొత్త కారును తయారు చేస్తున్నాయి. మరో రెండేళ్లలో అంబాసిడర్ 2.0 భారతీయ రోడ్లపై దూసుకుపోనుంది. మరోవైపు ఎలక్ట్రిక్ బైకులను కూడా హిందుస్తాన్ మోటార్స్ తయారు చేస్తోంది. ఈ-బైకులను కూడా మార్కెట్లో ప్రవేశపెట్టనుంది.