Modi Tour: మోదీ చెన్నై పర్యటన.. నిధులు విడుదల చేయాలని సీఎం డిమాండ్

ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులోని చెన్నైలో గురువారం పర్యటించారు. డీఎమ్‌కే అధికారం చేపట్టి, స్టాలిన్ సీఎంగా గెలిచిన తర్వాత మోదీ చెన్నైలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా చెన్నైలో దాదాపు రూ.31,000 కోట్ల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు.

Modi Tour: మోదీ చెన్నై పర్యటన.. నిధులు విడుదల చేయాలని సీఎం డిమాండ్

Modi Tour

Modi Tour: ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులోని చెన్నైలో గురువారం పర్యటించారు. డీఎమ్‌కే అధికారం చేపట్టి, స్టాలిన్ సీఎంగా గెలిచిన తర్వాత మోదీ చెన్నైలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా చెన్నైలో దాదాపు రూ.31,000 కోట్ల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో సీఎం స్టాలిన్‌తో కలిసి పాల్గొన్నారు.

Modi Speech: ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపుతున్న భారత్: మోదీ

ఈ సందర్భంగా తమిళ భాష, సంస్కృతికి ప్రాధాన్యం కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ‘‘తమిళనాడుకు రావడం చాలా సంతోషంగా ఉంది. తమిళ ప్రజలు, సంస్కృతి, భాష అసాధారణం. తమిళ భాష, సంస్కృతిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు మా ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుంది. బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్ వే రెండు అభివృద్ధి కేంద్రాలను కలుపుతుంది. ప్రస్తుతం శ్రీలంక ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి అందరూ ఆందోళన చెందుతున్నారు. శ్రీలంకను ఆదుకునేందుకు భారత్ ఎప్పుడూ ముందుంటుంది. శ్రీలంకకు మరింత సాయం అందిస్తాం. మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ ద్వారా ఉద్యోగావకాశాలు పెరుగుతాయి’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఇదే సభలో పాల్గొన్న తమిళనాడు సీఎం స్టాలిన్, మోదీకి పలు డిమాండ్లు చేశారు. తమిళ భాషను హిందీలాగే అధికారిక భాషగా ప్రకటించాలని కోరారు.

PM Narendra Modi : కుటుంబ పాలన అంటూ సీఎం కేసీఆర్ పై ప్రధాని మోడీ ఘాటు విమర్శలు..

‘‘కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల్లో, మద్రాస్ హైకోర్టులో తమిళాన్ని అధికార భాషగా చేయండి. నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి. జీఎస్టీకి సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయండి. రాష్ట్రంలో సమ్మిళిత అభివృద్ది జరుగుతోంది. మా పాలనా విధానాన్ని ద్రవిడియన్ మోడల్ అంటుంటాం. అభివృద్ది, సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం. అభివృద్ధి పథకాల్ని కేంద్రం ప్రారంభిస్తోంది. అయితే నిధులు రావడం లేదు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయండి’’ అని మోదీ సమక్షంలో స్టాలిన్ కోరారు.