Cold-Blooded Killer : ఒంటరి పురుషులపై దాడి

ఒంటరి మహిళలపై దాడి చేసి హతమార్చిన వాళ్లను చూసాం. తుపాకీ పుచ్చుకుని దాడులు జరిపే వాళ్ళను చూశాం... మా ప్రాంతానికి ఎందుకు వచ్చావని అడిగి హత్య చేసే వారిని కొందరిని చూశాం ...కానీ న్యూయా

Cold Blooded Killer

Cold-Blooded Killer :  ఒంటరి మహిళలపై దాడి చేసి హతమార్చిన వాళ్లను చూసాం. తుపాకీ పుచ్చుకుని దాడులు జరిపే వాళ్ళను చూశాం… మా ప్రాంతానికి ఎందుకు వచ్చావని అడిగి హత్య చేసే వారిని కొందరిని చూశాం …కానీ న్యూయార్క్ లో ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్న పురుషులను లక్ష్యంగా చేసుకుని దాడి చేసి హాతమారుస్తున్న ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే వాషింగ్టన్ డీసీలో ఇటీవలి కాలంలో వరస హత్యలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఐదుగురు పురుషులు హతమయ్యారు. వీరంతా 45 సంవత్సరాల పైబడిన ఒంటరిగా జీవిస్తున్న పురుషులే కావటం విశేషం. వీరంతా నిరాశ్రయులే. గత రెండురోజుల్లో దాడిచేసిన వారిలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
Also Read : TPCC Chief Revanth Reddy : రేవంత్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్ల ఢిల్లీ పయనం ?
దుండగుడు ఒంటరిగా ఉన్న పురుషులనే టార్గెట్ చేస్తున్నాడని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్, డీసీ వాషింగ్టన్‌ మేయర్‌ మురియెల్ బౌసర్‌లు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో వారు జంటనగరాల్లో నిరాశ్రయులై ఒంటరిగా ఉంటున్న పురుషులను అప్రమత్తంగా ఉండమని హెచ్చరిక జారీ చేశారు. పోలీసులు నిందుతుడి ఫోటోలు విడుదల చేశారు. ఆచూకీ తెలిపిన వారికి రూ. 19 లక్షలు బహుమతి ఇస్తామని కూడా తెలిపారు.