Medical Student Dies: అనస్తీషియా తీసుకుని వైద్య విద్యార్థిని ఆత్మహత్య
జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడిందో వైద్య విద్యార్థిని. తను పేషెంట్లకు అందించే అనస్తీషియానే అధిక మోతాదులో తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆదివారం జరిగింది.
- Narender Thiru
- Published On : July 24, 2022 / 07:39 PM IST
Medical Student Dies (1)
Medical Student Dies: జీవితంపై విరక్తితో అనస్తీషియా తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిందో వైద్య విద్యార్థిని. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 27 ఏళ్ల వైద్య విద్యార్థిని స్థానిక మహాత్మాగాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజీలో అనస్తీషియాలజీలో పీజీ చేస్తోంది.
Smriti Irani: కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపిన స్మృతి ఇరానీ
ఆసుపత్రిలో చదువుకుంటూనే వైద్య విద్య కూడా కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం తను ఉంటున్న హాస్టల్‌లో ఎక్కువ మోతాదులో అనస్తీషియా తీసుకుంది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. తన స్నేహితులు ఆమెకు కాల్ చేసినప్పటికీ రెస్పాండ్ కాలేదు. దీంతో ఆమె గదికి వచ్చి పరిశీలించగా, అనస్తీషియా తీసుకున్నట్లు గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. అనంతరం పోలీసులు ఆమె గదిలో ఒక డైరీని స్వాధీనం చేసుకున్నారు.
Volcano Erupts: జపాన్లో బద్ధలైన అగ్నిపర్వతం.. హై అలర్ట్ జారీ
అందులో జీవితంపై విరక్తి చెందినట్లు ఆమె రాసుకుంది. అంతకుమించి ఆత్మహత్యకు గల కారణాలు ఏమీ తెలియలేదు. మరోవైపు ఆమె స్నేహితులు కూడా తనకు ఏదైనా సమస్య ఉన్నట్లు తమతో చెప్పుకోలేదన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
