MiG-29K Aircraft: గోవాతీరంలో కుప్పకూలిన మిగ్-29 యుద్ధ విమానం.. సాంకేతిక లోపమే కారణమా?

గోవా తీరంలో భారత నౌకాదళానికి చెందిన మిగ్-29కె విమానం సాంకేతిక లోపంతో గోవా తీరంలో కుప్పకూలింది. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. అయితే, ఈ ఘటనలో పైలట్‌ క్షేమంగా బయటపడ్డాడు.

MiG-29K aircraft

MiG-29K Aircraft: గోవా తీరంలో భారత నౌకాదళానికి చెందిన మిగ్-29కె విమానం సాంకేతిక లోపంతో గోవా తీరంలో కుప్పకూలింది. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. గోవా నుండి సముద్రం మీదుగా సాధారణ ప్రయాణానికి బయలుదేరిన MiG 29K బేస్‌కు తిరిగి వస్తున్నప్పుడు సాంకేతిక లోపం ఏర్పడిందని, దీంతో ప్రమాదం చోటుచేసుకుందని నేవీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనలో పైలట్‌ క్షేమంగా బయటపడ్డాడు.

T20 World Cup 2022: ఫిట్‌నెస్‌ టెస్టులో షమీకి క్లియరెన్స్.. రేపు ఆస్ట్రేలియాకు షమీ, సిరాజ్, శార్దూల్.. బుమ్రా స్థానం భర్తీపై వీడని ఉత్కంఠ

ఈ ప్రమాదంలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడని, సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌లో పైలట్‌ను ప్రమాదం నుంచి కాపాడటం జరిగిందని నేవీ పేర్కొంది. స్వల్పగాయాల పాలైన పైలెట్ కు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కూలిపోవడానికి గల కారణాలను పరిశోధించాలని బోర్డు ఆఫ్ ఎంక్వైరీ (బీఓఐ)ని ఆదేశించింది. ఇదిలాఉంటే MiG-29K రష్యాలో నిర్మించిన K-36D-3.5 ఎజెక్షన్ సీటుతో అమర్చబడి ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైనదిగా పరిగణించబడుతుంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి

ఇదిలాఉంటే 2019 తర్వాత MiG-29Kకి సంబంధించి ఇది నాల్గవ ప్రమాదం. నవంబర్ 2020లో MiG-29K క్రాష్ తర్వాత ఒక ఫైటర్ పైలట్ మరణించాడు. ఘటన జరిగిన వెంటనే పైలట్‌లలో ఒకరిని రక్షించగా, ప్రమాదం జరిగిన 11 రోజుల తర్వాత కమాండర్ నిశాంత్ సింగ్ మృతదేహాన్ని వెలికితీశారు. అదే ఏడాది ఫిబ్రవరిలో పక్షులు ఢీకొనడంతో మరో MiG 29K కూలిపోయింది. నవంబర్ 2019లో, గోవాలోని ఒక గ్రామం వెలుపల MiG-29K ట్రైనర్ విమానం కూలిపోయింది. పైలట్‌లు ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు.