T20 World Cup 2022: ఫిట్‌నెస్‌ టెస్టులో షమీకి క్లియరెన్స్.. రేపు ఆస్ట్రేలియాకు షమీ, సిరాజ్, శార్దూల్.. బుమ్రా స్థానం భర్తీపై వీడని ఉత్కంఠ

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఫిట్‌నెస్ నిరూపించుకోవటంతో ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. షమీతో పాటు మహ్మద్ సిరాజుద్దీన్, శార్దూల్ ఠాకూర్ గురువారం ఆస్ట్రేలియాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దీపక్ చాహర్ టీ20 ప్రపంచ కప్‌కు దూరమైనట్లేనని తెలుస్తోంది.

T20 World Cup 2022: ఫిట్‌నెస్‌ టెస్టులో షమీకి క్లియరెన్స్.. రేపు ఆస్ట్రేలియాకు షమీ, సిరాజ్, శార్దూల్.. బుమ్రా స్థానం భర్తీపై వీడని ఉత్కంఠ

Team india

T20 World Cup 2022: రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ ఇండియా-2022 టోర్నీకోసం ఆస్ట్రేలియా వెళ్లిన విషయం విధితమే. ఆస్ట్రేలియాలో ఇతర జట్లతో వార్మప్ మ్యాచ్ సైతం ఆడుతున్నారు. అయితే టీ20 ప్రపంచ‌కప్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రకటించిన జట్టులో ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఉన్నారు. అయితే బుమ్రా వెన్నునొప్పి కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నారు. అతని స్థానంలో ఎవరిని భర్తీచేయాలన్న అంశంపై అపెక్స్ బోర్డు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. బుమ్రా స్థానంలో షమీ, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్ పేర్లు వినిపించాయి. షమీ పేరు ప్రముఖంగా వినిపించినప్పటికీ అతను కోవిడ్ కారణంగా జట్టు సభ్యులతో ఆస్ట్రేలియా వెళ్లలేక పోయాడు.

T20 World Cup 2022: టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా గెలిచే అవకాశాలు తక్కువ: ఆకాశ్ చోప్రా విమర్శలు

తాజాగా షమీ ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేయగా.. దీపక్ చాహర్ మాత్రం ఇంకా ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. అయితే ప్రస్తుతం షమీ ఫిట్‌నెస్ నిరూపించుకోవటంతో గురువారం ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. షమీతో పాటు మహ్మద్ సిరాజుద్దీన్, శార్దూల్ ఠాకూర్ గురువారం ఆస్ట్రేలియాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే షమీ రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. సిరాజ్, శార్దూల్ ఇద్దరూ రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో లేరు. స్టాండ్ బై లిస్ట్‌లో షమీ మాత్రమే ఉన్నాడు.

Team India’s T20 World Cup Squad: భారత ‘టీ20 ప్రపంచ కప్’ జట్టు ఫొటోలు వైరల్

అయితే బుమ్రా స్థానంలో షమీనే తుదిజట్టులోకి ఎంపిక అవుతాడా అంటే.. ఆ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం సిరాజ్, శార్దూల్ కూడా రిజర్వ్ లిస్ట్‌లో చేరడంతో  వీరిలో బుమ్రా స్థానంలో తుదిజట్టులో ఎవరు ఎంపికవుతారనే అంశం ఆసక్తికరంగా మారింది. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా అక్టోబర్ 23న పాకిస్తాన్‌తో ప్రారంభించనుంది. అంతకంటే ముందు టీమిండియా న్యూజీలాండ్, ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్‌లు ఆడుతుంది.