T20 World Cup 2022: టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా గెలిచే అవకాశాలు తక్కువ: ఆకాశ్ చోప్రా విమర్శలు

‘‘నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం.. టీమిండియా బౌలింగ్ చాలా బలహీనంగా ఉంది. సరిగ్గా వికెట్లు తీయలేకపోతున్నారు. చాహెల్ అన్ని వేళలా వేగంగా బంతులు వేస్తున్నాడు. ఒక్క బంతిని కూడా కాస్త నెమ్మదిగా వేయట్లేదు. ఆసియా కప్ లోనూ ఇదే జరిగింది. ఒక్కసారి కూడా బంతిని నెమ్మదిగా వేయకపోతే వికెట్లు ఎలా తీస్తాం? బలహీనంగా ఉన్న బౌలింగ్ లైనప్ తో ప్రపంచ కప్ ను గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. భారత బ్యాట్స్ మెన్ 208 పరుగులు చేసినప్పటికీ ఆ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఛేదించకుండా అడ్డుకోలేకపోయారు. దీంతో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటారు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పారు.

T20 World Cup 2022: టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా గెలిచే అవకాశాలు తక్కువ: ఆకాశ్ చోప్రా విమర్శలు

T20 World Cup 2022

T20 World Cup 2022: ఆస్ట్రేలియాలో వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నారు. ఇటీవల జరిగిన ఆసియా కప్ లో భారత్ పాకిస్థాన్, శ్రీలంక చేతిలో ఓడిపోయి ఇంటి ముఖం పట్టిన విషయం తెలిసిందే. అలాగే, మొన్న ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచులోనూ ఫీల్డింగులో రాణించలేక ఓడిపోయింది.

దీంతో భారత ఆటగాళ్ల ప్రదర్శనపై ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ… ‘‘నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం.. టీమిండియా బౌలింగ్ చాలా బలహీనంగా ఉంది. సరిగ్గా వికెట్లు తీయలేకపోతున్నారు. చాహెల్ అన్ని వేళలా వేగంగా బంతులు వేస్తున్నాడు. ఒక్క బంతిని కూడా కాస్త నెమ్మదిగా వేయట్లేదు. ఆసియా కప్ లోనూ ఇదే జరిగింది. ఒక్కసారి కూడా బంతిని నెమ్మదిగా వేయకపోతే వికెట్లు ఎలా తీస్తాం? బలహీనంగా ఉన్న బౌలింగ్ లైనప్ తో ప్రపంచ కప్ ను గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. భారత బ్యాట్స్ మెన్ 208 పరుగులు చేసినప్పటికీ ఆ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఛేదించకుండా అడ్డుకోలేకపోయారు. ఇటువంటి ఆటతీరు వల్ల టీమండియాకు క్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయి’’ అని చెప్పారు.

కాగా, మొన్న జరిగిన మ్యాచులో టీమిండియా 208 పరుగులు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఫీల్డింగ్ లో టీమిండియా రాణించలేకపోవడంతో ఆస్ట్రేలియా ఆ లక్ష్యాన్ని ఛేదించి మూడు టీ20ల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇవాళ నాగ్ పూర్ లో రెండో టీ20 జరగనుంది.

Amit shah slams nitish kumar: ఇలాగైతే నితీశ్ బాబు దేశ ప్రధాని ఎలా కాగలరు?: అమిత్ షా