Miller on Hardik’s leadership: హార్దిక్ పాండ్యా సారథ్యంపై డేవిడ్ మిల్లర్ ప్రశంసల జల్లు

‘‘హార్దిక్ పాండ్యాతో కలిసి ఐపీఎల్ లో ఆడాను. అతడు సహజమైన నాయకుడు. ఆటగాళ్లు అతడిని అనుసరించవచ్చు. మనం ఎలా ఆడితే బాగా రాణిస్తామని అనుకుంటామో అలాగే ఆడే అవకాశాన్ని కల్పిస్తాడు. నాయకుడిగా అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తాడు. జట్టులో అందరూ సన్నిహితంగా ఉండాలని భావిస్తాడు. అదే సమయంలో క్రమశిక్షణపై స్పష్టమైన వైఖరితో ఉంటాడు. నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ అతడిలో ఉన్నాయి’’ అని డేవిడ్ మిల్లర్ చెప్పాడు.

Miller on Hardik’s leadership: టీమిండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ ప్రశంసల జల్లు కురిపించాడు. భారత టీ20 క్రికెట్ కు హార్దిక్ పాండ్యా సారథ్య నైపుణ్యాలు బాగా ఉపయోగపడతాయని అన్నాడు. న్యూజిలాండ్ తో తాజాగా జరిగిన టీ20 సిరీస్ లో టీమిండియా 1-0 తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. అలాగే, గత ఐపీఎల్ లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచింది. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున డేవిడ్ మిల్లర్ కూడా ఆడాడు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో హార్దిక్ పాండ్యా గురించి డేవిడ్ మిల్లర్ మాట్లాడాడు.

‘‘హార్దిక్ పాండ్యాతో కలిసి ఐపీఎల్ లో ఆడాను. అతడు సహజమైన నాయకుడు. ఆటగాళ్లు అతడిని అనుసరించవచ్చు. మనం ఎలా ఆడితే బాగా రాణిస్తామని అనుకుంటామో అలాగే ఆడే అవకాశాన్ని కల్పిస్తాడు. నాయకుడిగా అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తాడు. జట్టులో అందరూ సన్నిహితంగా ఉండాలని భావిస్తాడు. అదే సమయంలో క్రమశిక్షణపై స్పష్టమైన వైఖరితో ఉంటాడు. నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ అతడిలో ఉన్నాయి’’ అని డేవిడ్ మిల్లర్ చెప్పాడు.

కాగా, న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్ గెలుచుకున్న టీమిండియా రేపటి నుంచి వన్డే సిరీస్ ఆడనుంది. కాగా, రోహిత్ శర్మ మరో రెండేళ్ల తర్వాత టీ20ల్లో కొనసాగే అవకాశాలు అంతగా లేకపోవడంతో 2024 టీ20 ప్రపంచ కప్ నకు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఉండే అవకాశం ఉంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

ట్రెండింగ్ వార్తలు