Fire in Taj Express : తాజ్ ఎక్స్‌ప్రెస్ రైలు అగ్నిప్ర‌మాదం..ఏసీ బోగీలో మంటలు

న్యూఢిల్లీ నుంచి ఝాన్సీ వెళ్తున్న తాజ్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు వ్యాపించాయి. దీంతో రైలుని హ‌ర్యానాలోని అసోతి స్టేష‌న్ వ‌ద్ద నిలిపివేశారు.

Fire Breaks Out In Taj Express

fire breaks out in taj express : న్యూఢిల్లీ నుంచి ఝాన్సీ వెళ్తున్న తాజ్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్ర‌మాదం సంభవించింది. రైలులోని ఏసీ బోగీలో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ప్రయాణీకులకు ఎవ్వరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.రైలులోని ఏసీ బోగీలో ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు నార్త‌ర్న్ రైల్వేస్ తెలిపింది. డిల్లీ నుంచి యూపీలోని ఝాన్సీ వెళుతున్న తాజ్ ఎక్స్ ప్రెస్ లో శనివారం (నవంబర్ 13,2021) ఉద‌యం 7.40 నిమిషాల స‌మ‌యంలో ఏసీ బోగీ నుంచి పొగ వ‌స్తున్న‌ట్లు గుర్తించారు. దీంతో ప్రయాణీకులు హడలిపోయారు. భయాందోళనలకు గురయ్యారు.

Readmore : Joker Sets Train on Fire : రైల్లో మంటలు పెట్టిన ‘జోకర్‌’..17మంది ప్రయాణీకులకు గాయాలు

ఏసీ బోగీలో స్వల్పంగా మంటలు వ్యాపించటంతో రైలును హ‌ర్యానాలోని అసోతి స్టేష‌న్ వ‌ద్ద నిలిపివేశారు. బ్రేక్ జామ్ కావ‌డం వ‌ల్ల అగ్నిప్ర‌మాదం సంభ‌వించిన‌ట్లు ఓ రైల్వే అధికారి చెప్పారు. మంట‌ల్ని ఆర్పేశామ‌ని, ప్ర‌యాణికులు అంద‌రూ సుర‌క్షితంగా ఉన్నార‌ని ఎటువంటి భయాందోళనలకు గురి కావద్దని తెలిపారు. ఏసీ బోగీలో చాలా స్వ‌ల్ప స్థాయిలో మంట‌లు వ‌చ్చాయ‌ని..మంటలు కంటే పొగ ఎక్కువగా వ్యాపించిందని సీపీఆర్వో దీప‌క్ కుమార్ తెలిపారు.