Joker Sets Train on Fire : రైల్లో మంటలు పెట్టిన ‘జోకర్‌’..17మంది ప్రయాణీకులకు గాయాలు

 జపాన్‌ రాజధాని టోక్యోలో ‘జోకర్’ గెటప్ లో వచ్చిన ఓ వ్యక్తి రైల్లో మంటలు పెట్టాడు. దీంతో హడలిపోయిన ప్రయాణీకులు కిటికీల్లోంచి దూకి పారిపోవటానికి యత్నించే క్రమంలో 17మంది గాయపడ్డారు.

Joker Sets Train on Fire : రైల్లో మంటలు పెట్టిన ‘జోకర్‌’..17మంది ప్రయాణీకులకు గాయాలు

Japan Man Dressed As Batman Joker Sets Train On Fire 10 Injured 

Japan Man Dressed As Batman Joker Sets Train on Fire : జపాన్‌ రాజధాని టోక్యోలో ఆదివారం ‘జోకర్’ గెటప్ లో వచ్చిన ఓ వ్యక్తి సృష్టించిన బీభత్సానికి ప్రయాణీకులంతా హడలిపోయారు. పరుగులు పెట్టారు. అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో హాలోవీన్‌ కార్యక్రమం జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో చిత్ర విచిత్రమైన గెటప్పుల్లో వచ్చి జనాలను భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. దీంట్లో భాగంగా ఓ వ్యక్తి మెట్రో రైల్లో బీభత్సం సృష్టించాడు.

రైల్లో ఓ రకమైన కెమికల్ పోసి నిప్పు పెట్టాడు.ఓ వృద్ధుడిపై కత్తితో దాడికి యత్నించాడు. ఈ హఠాత్పరిణామానికి ప్రయానీకులంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కొంతమంది కిటికీల్లోంచి దూకి బయటకు పారిపోయేందకు యత్నించారు.మరికొంతమవంది ఎలా పారిపోయే దారి లేక అల్లాడిపోయారు. జపాన్‌లో హాలోవీన్‌ కార్యక్రమం సందర్భంగా హాలివుడ్ సినిమాలో ‘జోకర్‌’ గెటప్ లో వచ్చిన ఓ వ్యక్తి రైల్లో బీభత్సం సృష్టించాడు. కొకుర్యో స్టేషన్ సమీపంలోని కీయో రైలులో ట్రైన్‌లో మంట పెట్టాడు.. కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయి.

Read more : Indian railway ‘పైసా వసూల్’ రైల్లో దుప్పట్లు, బెడ్‌షీట్స్ కావాలంటే భారీగా చెల్లించుకోవాల్సిందే

అతగాడి శాడిజానికి కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణికులు బిక్కచచ్చిపోయారు. కొందరు కిటికీలోంచి బయటకు దూకి పారిపోయే ప్రయత్నం చేశారు. ఆ దారిలో ఓ ఎమర్జెన్సీ స్టాప్‌ ఉండటంతో రైలు అక్కడ ఆపటంతో జనాలంతా బయలకు పరుగులు తీశారు. సదురు జోకర్‌ వేషదారి చేసిన బీభత్సానికి 17మంది గాయపడినట్లుగా తెలుస్తోంది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఎమర్జెన్సీ స్టాప్‌ వద్దకు చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నించారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఓ ప్రయాణీకుడు మాట్లాడుతు. ‘‘ ఓ వ్యక్తి జోకర్‌ గెటప్‌లో వచ్చి ట్రైన్ లో అందరిని భయపెట్టాడు.మంటలు పెట్టాడు.ఓ వృద్ధుడిపై దాడికి యత్నించాడు..హాలోవీన్‌ స్టంట్‌లో భాగంగా ఇలా చేసి ఉంటాడని మేం అనుకుంటున్నామని తెలిపాడు. ట్రైన్‌ ఎమర్జన్సీ స్టాప్ లో ఆగిన తరువాత సదరు వ్యక్తి ఏమాత్రం కంగారుపడకుండా తాపీగా రైలు దిగి అక్కడ నుంచి చాలా క్యాజువల్ గా నడుచుకుంటూ బయటకు వెళ్లిపోయాడు’’ అని తెలిపాడు.

Read more : Maglev Trains : వెయ్యి కిలోమీటర్లు రెండున్నర గంటలు..చైనా అత్యాధునిక మాగ్లెవ్ రైలు

కాగా గాయపడినవారిలో ఓ విద్యార్ధి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతనికి 26 ఏళ్ల యువకుడిగా పోలీసులు గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.