Indian railway ‘పైసా వసూల్’ రైల్లో దుప్పట్లు, బెడ్‌షీట్స్ కావాలంటే భారీగా చెల్లించుకోవాల్సిందే

భారత రైల్వే శాఖ ప్రయాణీకుల నుంచి ‘పైసా వసూల్’ పద్దతి మొదలు పెట్టిందా అన్నట్లుగా ఉంది. ఇకనుంచి రైల్లో దుప్పట్లు, బెడ్‌షీట్స్ కావాలంటే భారీగా చెల్లించుకోవాల్సిందేనంటోంది.

Indian railway ‘పైసా వసూల్’ రైల్లో దుప్పట్లు, బెడ్‌షీట్స్ కావాలంటే భారీగా చెల్లించుకోవాల్సిందే

Indian Railway Bed Rolls

Train in ‘Bed rolls’ cost : రైల్వే శాఖ ప్రయాణీకులకు షాకిచ్చింది. జేబులకు చిల్లులు పడే మాట ఒకటి చెప్పింది. ఏసీ బోగీలో ప్రయాణించేవారికి ఇది మరింత షాకింగ్ విషయం అనే చెప్పాలి. ఏసీ బోగీలో ప్రయాణీకులకు ఇచ్చే ‘బెడ్ రోల్స్’ కావాలంటే డబ్బులు భారీగా ఇవ్వాల్సిందేనంటోంది రైల్వే శాఖ. ఇక నుంచి రైలులో దుప్పట్లు, బెడ్‌షీట్స్ (‘బెడ్ రోల్స్’) కావాలంటే రూ. 30 నుంచి రూ. 300 వరకు చెల్లించాలంటోంది. అంటే జేబులకు చిల్లు పడ్డట్లే. రానున్నది శీతాకాలం కావటంతో ప్రయాణీకులు బెడ్ రోల్స్ తీసుకుంటారు. ఇదే అదనుగా భావించిన రైల్వే ప్రయాణీకులనుంచి డబ్బులు గుంజే ప్లాన్ వేసినట్లుగా ఉంది.

ఢిల్లీతో సహా పలు రైల్వే డివిజన్ల రైళ్లలో డిస్పోజబుల్ బెడ్ షీట్లు, దుప్పట్లు వంటి అవసరమైన కిట్‌లను ప్రయాణీకులకు అందించటానికి స్టేషన్లలో అల్ట్రా-వైలెట్ బేస్డ్ లగేజ్ శానిటైజేషన్ మెషిన్లను ప్రారంభించింది. ఇందుకోసం రైళ్లలో ప్రయాణించే ప్రతీ ప్రయాణీకుడు కనిష్టంగా రూ. 30 నుంచి రూ. 300 వరకు చెల్లించాల్సి ఉంటుంది.కాగా..కరోనా వైరస్ మొదటి వేవ్ ప్రారంభం నుంచి రైల్వే శాఖ బెడ్ షీట్స్, దుప్పట్లు, దిండు ఇవ్వడాన్ని రైల్వే శాఖ ఆపివేసింది.

కరోనా ఉధృతి తగ్గిన తర్వాత నుంచి ఇండియన్ రైల్వే..విడదల వారీగా..ట్రైన్ సర్వీసులను ప్రారంభిస్తూ వస్తోంది. ప్రస్తుతం కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా 95 శాతం రైళ్లు నడుస్తున్నాయి. వీటిల్లోని ఏసీ కోచ్‌లలో బెడ్ రోల్స్ సౌకర్యం లేదు. ప్రయాణీకులు తమ వెంటే దుప్పట్లు, దిండ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. కరోనా తగ్గటంతో రైల్వే తిరిగి బెడ్ రోల్స్ ఆ సౌకర్యాన్ని ప్రారంభించింది. దీని కోసం మూడు రకాల కిట్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

మూడు రకాల కిట్లు ఇవే..
మొదటి రకం కిట్ కావాలంటే ప్రయాణీకులు రూ. 300 చెల్లించాలి. ఈ కిట్ లో ఓ దుప్పటి, దిండు, బెడ్ షీట్, బ్యాగ్, టూత్‌పేస్ట్, హెయిర్ ఆయిల్, దువ్వెన, శానిటైజర్ సాచెట్, పేపర్ సబ్బు, టిష్యూ పేపర్ ఉంటాయి.

రెండవ కిట్ లో కేవలం దుప్పట్లు మాత్రమే ఉంటాయి. ఇది కావాలంటే..రూ. 150 చెల్లించాలి.

మూడవ కిట్ లో టూత్‌పేస్ట్, టూత్ బ్రష్, హెయిర్ ఆయిల్, దువ్వెన, శానిటైజర్, పేపర్ సబ్బు, టిష్యూ ఉంటాయి. ఇది కావాలంటే రూ. 30 చెల్లించాలి.