Raja Singh
Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం నడిరోడ్డుపై నిలిచిపోయింది. బుధవారం షాద్ నగర్ వెళ్లి వస్తుండగా, మార్గమధ్యలో వాహనం నిలిచిపోయింది. దీంతో మరో వాహనం తెప్పించుకుని హైదరాబాద్ బయలుదేరారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఉగ్రవాదులు, ఇతర సంస్థల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం సమకూర్చింది.
Telangana Rains : ఈ ఏడాది సమృధ్ధిగా వర్షాలు-వ్యవసాయానికి అనుకూలం
ఆయనకు ఉన్న ముప్పు దృష్ట్యా కచ్చితంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే వెళ్లాలని పోలీసులు సూచించారు. అయితే, తరచూ వాహనం చెడిపోతుందని, దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం ఉండటం లేదని రాజాసింగ్ అన్నారు. తనకు ఎప్పుడో చంద్రబాబు కాలం నాటి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారని, తెలంగాణ ప్రభుత్వం కొత్తవి కొన్నప్పటికీ వాటిని ఆ పార్టీకి చెందిన మంత్రులకు, వారికి అనుకూలంగా ఉండే వ్యక్తులకే కేటాయించారని ఆయన అన్నారు. తనను తాను ఎలా రక్షించుకోవాలో తెలుసన్నారు.
TRS Rajyasabha: టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు
‘‘మాకు ఆ దేవుడు, తెలంగాణ ప్రజలు అండగా ఉన్నారు. శత్రువుల నుంచి ప్రమాదం పొంచి ఉన్నవాళ్లకు ఇలాంటి పాత వాహనాలు ఇవ్వడం సరైంది కాదు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు?’’ అని రాజాసింగ్ ప్రశ్నించారు.