Vijay Devarkonda: రౌడీ స్టార్‌ను డైరెక్ట్ చేయబోతున్న క్లాస్ చిత్రాల డైరెక్టర్.. వర్కవుట్ అయ్యేనా?
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన రీసెంట్ మూవీ ‘లైగర్’ పాన్ ఇండియా మూవీగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు ఈ స్టార్ హీరో. ఇప్పటికే ‘ఖుషి’ సినిమాలో నటిస్తున్న విజయ్, త్వరలోనే మరో క్లాస్ చిత్రాల దర్శకుడితో పనిచేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
- Anil Aaleti
- Published On : November 5, 2022 / 05:16 PM IST
Mohanakrishna Indraganti To Direct Vijay Devarakonda
Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన రీసెంట్ మూవీ ‘లైగర్’ పాన్ ఇండియా మూవీగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తెరకెక్కించగా, సినిమా కథలో బలం లేకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలిచింది. ఈ సినిమాతో నిర్మాతలు భారీగా నష్టపోయినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఇప్పుడు తన నెక్ట్స్ చిత్రాల పట్ల చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు ఈ హీరో.
Vijay Devarakonda: ‘ఖుషి’ మూవీని కూడా… విజయ్ దేవరకొండ ప్లాన్ ఏమిటో?
ఇప్పటికే దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ అనే సినిమాలో నటిస్తున్న విజయ్ దేవరకొండ, ఇప్పుడు మరో క్లాస్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడట. గోల్కొండ హై స్కూల్, సమ్మోహనం, అమీ తుమీ, జెంటిల్ మెన్ వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ, రీసెంట్‌గా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఈ డైరెక్టర్ విజయ్ దేవరకొండ కోసం ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సబ్జెక్టును రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
Vijay Devarakonda: యూఎస్ డీల్ క్లోజ్ చేసుకున్న ఖుషి.. టార్గెట్ ఎంతంటే?
ఇక ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించేందుకు రెడీ అవుతున్నాడట. గతంలోనే దిల్ రాజు బ్యానర్‌లో ఓ సినిమా చేసేందుకు విజయ్ దేవరకొండ ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణను దిల్ రాజు బ్యానర్‌లో ఓ సినిమా చేసేందుకు తీసుకోవడంతో, ఈ కాంబినేషన్ ఖచ్చితంగా విజయ్ దేవరకొండ కోసమే అని అందరూ భావిస్తున్నారు. మరి రౌడీ స్టార్ కోసం ఇంద్రగంటి ఎలాంటి కథను రెడీ చేస్తాడో చూడాలి.
