Monsoon likely starting June 18: జూన్ 18 నాటికి రుతుపవనాలు తిరిగి ప్రారంభం..వాతావరణశాఖ వెల్లడి

రుతుపవనాల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు వాతావరణశాఖ ఆలస్యంగానైనా చల్లటి కబురు చెప్పింది. బిపర్‌జోయ్ తుపాన్ వల్ల మందగించిన రుతుపవనాలు జూన్ 18వతేదీ నాటికి తిరిగి ప్రారంభం అవుతాయని భారత వాతావరణశాఖ గురువారం వెల్లడించింది....

Monsoon likely starting

Monsoon likely starting June 18: రుతుపవనాల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు వాతావరణశాఖ ఆలస్యంగానైనా చల్లటి కబురు చెప్పింది. బిపర్‌జోయ్ తుపాన్ వల్ల మందగించిన రుతుపవనాలు జూన్ 18వతేదీ నాటికి తిరిగి ప్రారంభం అవుతాయని భారత వాతావరణశాఖ గురువారం వెల్లడించింది.(weather department) జూన్ 11 వతేదీ నుంచి ప్రారంభమైన నైరుతి రుతుపవనాలు పెద్దగా పురోగమించలేదు. జూన్ 18 వతేదీ నుంచి మాత్రమే రుతుపవనాలు ముందుకు సాగే అవకాశం ఉందని భారత వాతావరణ కార్యాలయం తెలిపింది. గతంలో రుతుపవనాల ఆరంభం బలహీనంగా ఉందని నిపుణులు హెచ్చరించారు.

Cyclone Biparjoy To Hit Pakistan: పాకిస్థాన్‌ను తాకిన బిపర్‌జోయ్ తుపాన్..సింధ్ తీరప్రాంతాల్లో 66వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు

‘‘తుపాన్ కారణంగా దక్షిణ అర్ధగోళం నుంచి ఉత్తర అర్ధగోళానికి గాలి ప్రవాహం బలపడింది. దీంతో తుపాన్ చాలా నెమ్మదిగా కదిలింది.రుతుపవనాలను ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడింది’’ అని ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎం మోహపాత్ర చెప్పారు.‘‘18వ తేదీ తర్వాత రుతుపవనాల ప్రసరణ బలపడుతోంది. జూన్ 18 నాటికి రుతుపవనాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది’’అని మోహపాత్ర వెల్లడించారు.

Cyclone Biparjoy : నేడు తీరం దాటనున్న బిపర్‌జోయ్ తుపాన్..74వేల మంది తరలింపు

కాగా జూన్ చివరి వారం నాటికి రుతుపవనాలు పుంజుకుంటాయని ఆశిస్తున్నట్లు భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి ఎం రాజీవన్ తెలిపారు.జూన్ 20-21 వతేదీ నాటికి రుతుపవనాలు తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌కు చేరుకుంటాయని తాము ఆశిస్తున్నట్లు స్కైమెట్ వెదర్ యొక్క వాతావరణ శాస్త్ర వైస్ ప్రెసిడెంట్ మహేష్ పలావత్ వెల్లడించారు.ఈ సంవత్సరం ఐఎండీ సాధారణ రుతుపవనాలను అంచనా వేసింది. దీర్ఘకాల సగటులో 96శాతం వర్షపాతం ఉంటుందని అంచనా వేసింది.