Cyclone Biparjoy To Hit Pakistan: పాకిస్థాన్‌ను తాకిన బిపర్‌జోయ్ తుపాన్..సింధ్ తీరప్రాంతాల్లో 66వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు

బిపర్‌జోయ్ తుపాన్ గురువారం ఉదయం పాకిస్థాన్ తీరాన్ని తాకింది. సింధ్ లోని కేతి బందర్ ను తుపాన్ తాకిందని పాకిస్థాన్ వాతావరణ, ఇంధన శాఖ మంత్రి షెర్రీ రెహ్మాన్ చెప్పారు.తుపాన్ సందర్భంగా సింధ్ సముద్ర తీర ప్రాంతాల్లో 66వేల మందిని సురక్షితప్రాంతాలకు తరలించామని పాక్ మంత్రి చెప్పారు....

Cyclone Biparjoy To Hit Pakistan: పాకిస్థాన్‌ను తాకిన బిపర్‌జోయ్ తుపాన్..సింధ్ తీరప్రాంతాల్లో 66వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు

Cyclone Biparjoy To Hit Pakistan

Updated On : June 15, 2023 / 2:05 PM IST

Cyclone Biparjoy To Hit Pakistan: బిపర్‌జోయ్ తుపాన్ గురువారం ఉదయం పాకిస్థాన్ తీరాన్ని తాకింది. సింధ్ లోని కేతి బందర్ ను తుపాన్ తాకిందని పాకిస్థాన్ వాతావరణ, ఇంధన శాఖ మంత్రి షెర్రీ రెహ్మాన్ చెప్పారు. (Cyclone Biparjoy To Hit Sindh) తుపాన్ సందర్భంగా సింధ్ సముద్ర తీర ప్రాంతాల్లో 66వేల మందిని (66,000 People Evacuated)సురక్షితప్రాంతాలకు తరలించామని పాక్ మంత్రి చెప్పారు. తుపాన్ అనంతరం సహాయక చర్యలు చేపట్టేందుకు రెస్క్యూ ఏజెన్సీలను సిద్ధంగా ఉంచామని ఆమె పేర్కొన్నారు.

Cyclone Biparjoy : నేడు తీరం దాటనున్న బిపర్‌జోయ్ తుపాన్.. 74వేల మంది తరలింపు

తుపాను వల్ల తట్టా, సుజావాల్, బాడిన్, థార్పార్కర్ జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పాక్ వాతావరణ మంత్రి తెలిపారు. తుఫాను కారణంగా పాకిస్తాన్‌లో చిన్న విమానాల రాకపోకలను నిలిపివేయవలసిందిగా అధికారులను ఆదేశించామని ఆమె అన్నారు.తుపాన్ ప్రభావం వల్ల గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.తుపాన్ ప్రభావం వల్ల కొండచరియలు విరిగిపడటంతోపాటు కరాచీ తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తున్నాయని మంత్రి షెర్రీ రెహ్మాన్ వివరించారు.