సిస్టమ్‌ని ఆట ఆడించేవాడే కింగ్..

సిస్టమ్‌ని ఆట ఆడించేవాడే కింగ్..

Updated On : February 27, 2021 / 1:13 PM IST

Mosagallu Trailer: యువ కథానాయకుడు మంచు విష్ణు, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం.. ‘మోసగాళ్లు’. ప్రపంచంలో అతి పెద్ద ఐటీ స్కామ్‌ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకు జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. AVA Entertainment, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై విష్ణు నిర్మిస్తున్నారు.

Mosagallu

ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్ ఆకట్టుకున్నాయి. గురువారం ‘మోసగాళ్లు’ థియేట్రికల్ ట్రైలర్ మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగింది. పేదరికం నుండి బయటపడాలనుకునే హీరో ప్రపంచంలోనే వేలాది కోట్ల రూపాయల అతిపెద్ద స్కామ్ చేసి దాన్నుంచి ఎలా తప్పించుకున్నాడనేది ‘మెసగాళ్లు’ కథ అని క్లుప్తంగా చెప్పారు. విష్ణఉ మేకోవర్ ఆకట్టుకుంటోంది.

అనుగా కాజల్‌ అగర్వాల్‌, అర్జున్‌గా విష్ణు కనిపించనున్నారు. బాలీవుడ్ నటుడు సునీల్‌ శెట్టి విలన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో రుహీ సింగ్‌ కథానాయిక.. నవదీప్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శామ్ సిఎస్ ఈ సినిమాకి సంగీత మందిస్తున్నారు. పాన్‌ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.