Viral News: బంగారు గనుల్లో ‘మమ్మీ’ అవశేషాలు.. 30వేల సంవత్సరాల క్రితం..

వాయువ్య కెనడియన్ గోల్డ్ మైన్‌లో (బంగారం గని) అరుదైన మమ్మీ అవశేషాలను గుర్తించారు. స్థానిక ట్రొండెక్ హ్వెచిన్ ఫస్ట్ నేషన్ సభ్యులు దీనిని కనిపెట్టారు. ఇది ఒక ఆడ జంతువుగా గుర్తించారు. ఈ మమ్మీ అవశేషాలు ప్రపంచంలో ఇప్పటి వరకు కనుగొనబడని అత్యద్భుతమైన మంచు యుగం నాటి జంతువులకు సంబంధించిన మమ్మీలలో ఒకరకంగా గుర్తించారు.

Mummified

Viral News: వాయువ్య కెనడియన్ గోల్డ్ మైన్‌లో (బంగారం గని) అరుదైన మమ్మీ అవశేషాలను గుర్తించారు. స్థానిక ట్రొండెక్ హ్వెచిన్ ఫస్ట్ నేషన్ సభ్యులు దీనిని కనిపెట్టారు. ఇది ఒక ఆడ జంతువుగా గుర్తించారు. ఈ మమ్మీ అవశేషాలు ప్రపంచంలో ఇప్పటి వరకు కనుగొనబడని అత్యద్భుతమైన మంచు యుగం నాటి జంతువులకు సంబంధించిన మమ్మీలలో ఒకరకంగా గుర్తించారు. అంటే సుమారు 30వేల సంవత్సరాల కంటే పాతది అని అంచనా.

Viral Video: నగల దుకాణంలో దొంగల హల్‌చల్.. భయంతో వణికిపోయిన కస్టమర్లు.. వీడియో వైరల్

తవ్వకాల్లో భాగంగా లభించిన మమ్మీని పోలియున్న అవశేషాలు చర్మం, జుట్టు కొంచెం కూడా చెక్కు చెదర్లేదు. అయితే 30ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో అడవి గుర్రాలు, గుహ సింహాలు ఈ ప్రాంతంలో సంచరించేవి. అవి మంచు తుఫాను కారణంగా చనిపోయి ఉండవచ్చని పాలియోంటాలజిస్ట్ గ్రాంట్ జాజులా తెలిపారు. అయితే ఈ బృదం ఈ మమ్మీకి ‘నన్ చో’ (పెద్ద పిల్ల) అని పేరు పెట్టారు.

Viral Video: హమ్మయ్య బతికిపోయా.. మంచమెక్కి పైకొచ్చిన పులి.. వీడియో వైరల్

ఇదిలా ఉంటే అలస్కాలో ఇటువంటి ఇతర రకాల ఆవిష్కరణలు నివేదించబడ్డాయి. 1948లో ‘ఎఫీ’ అనే మమ్మీని గుర్తించారు. 2007 సంవత్సరంలో సైబీరియాలోని లియుబాలో 42వేల సంవత్సరాల వయస్సు గల మమ్మీని గుర్తించారు. ప్రస్తుతం బయటపడ్డ ఈ నన్ చో, ఈ లియుబా మమ్మీ రెండు దాదాపు ఒకే పరిమాణంలో ఉండటం గమనార్హం. పురాతత్వ శాస్త్రవేత్త గ్రాంట్ జజులా మాట్లాడుతూ.. ఇది చాలా అందమైనదని, ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరూ కనుగొనని అత్యంత అద్భుతమైన మంచు యుగం జంతువులలో ఒకటి అని చెప్పారు.