Viral Video: నగల దుకాణంలో దొంగల హల్‌చల్.. భయంతో వణికిపోయిన కస్టమర్లు.. వీడియో వైరల్
దొంగలు ఓ నగల దుకాణంలో దోపిడీకి పాల్పడ్డారు. దుకాణంలోకి వచ్చిన ఐదుగురు వ్యక్తులు తుపాకీతో ఓనర్ ను బెదిరించారు. కస్టమర్లను బెదిరించడంతో వారు బిక్కుబిక్కుమంటూ కదలకుండా ఉండిపోయారు. ఈ క్రమంలో ఓనర్ తిరగబడటంతో అతన్ని చితక బాదుడుబాది తుపాకీతో కాల్చి చంపేశారు. దుకాణంలోని బంగారాన్ని బ్యాగులో వేసుకొని అక్కడి నుంచి హుడాయించారు.

Bihar
Viral Video: దొంగలు ఓ నగల దుకాణంలో దోపిడీకి పాల్పడ్డారు. దుకాణంలోకి వచ్చిన ఐదుగురు వ్యక్తులు తుపాకీతో ఓనర్ ను బెదిరించారు. కస్టమర్లను బెదిరించడంతో వారు బిక్కుబిక్కుమంటూ కదలకుండా ఉండిపోయారు. ఈ క్రమంలో ఓనర్ తిరగబడటంతో అతన్ని చితక బాదుడుబాది తుపాకీతో కాల్చి చంపేశారు. దుకాణంలోని బంగారాన్ని బ్యాగులో వేసుకొని అక్కడి నుంచి హుడాయించారు. ఈ ఘటన బీహార్ లోని హాజీపూర్ లో జూన్ 22న రాత్రి 8గంటల సమయంలో చోటు చేసుకుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ దుకాణం రద్దీగా ఉండే ప్రదేశంలోనే రోడ్డుకు ఆనుకొని ఉంది. దొంగలు దుకాణంలోకి తుపాకీతో రావడంతో కస్టమర్లు భయంతో వణికిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు ‘వామ్మో.. ఇలాంటి సమయంలో ఏమీ చేయగలం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Viral Video: హమ్మయ్య బతికిపోయా.. మంచమెక్కి పైకొచ్చిన పులి.. వీడియో వైరల్
బీహార్‌లోని హాజీపూర్ నడిబొడ్డున సుభాష్, మదాయి చౌక్‌ల మధ్యలో ఉన్న నీలం జ్యువెలరీలోకి ఐదుగురు దొంగలు ప్రవేశించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. దుండగులు దుకాణంలోకి ప్రవేశించి వినియోగదారులను భయపెట్టడం ప్రారంభించారు. దుకాణం యజమాని సునీల్ ప్రియదర్శి దొంగలు బంగారం దోపిడి ప్రయత్నాన్ని ప్రతిఘటించాడు. దీంతో అతన్ని పలుసార్లు కొట్టారు. అయిన ప్రియదర్శి వారిని ప్రతిఘటించడంతో చివరికి దుండగులు యాజమానిని కాల్చి చంపారు. దుకాణంలోనే ఉన్న కస్టమర్లు ఈ ఘనతో భయంతో వణికిపోయారు. ఈ సమయంలో షాపులో పదేళ్లలోపు చిన్నారి, అతని తల్లి కూడా ఉంది. నగల దుకాణంలోకి వచ్చిన వెంటనే ముందు ఆ చిన్నారికి గన్ పెట్టి అతడి తల్లిని, కస్టమర్లను బెదిరించినట్లు వీడియోలో కనిపించింది. దీంతో చిన్న పిల్లాడు, అతడి తల్లి బిక్కుబిక్కు మంటూ నేలపై కూర్చుండిపోయారు. మిగిలిన కస్టమర్లు ఎక్కడివారు అక్కడ కదలకుండా ఉండిపోయారు.
बिहार pic.twitter.com/hFQRVOBsQn
— Sanket Upadhyay (@sanket) June 26, 2022
ఈ ఘటనతో నగరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ తక్షణ విచారణకు ఆదేశించారు. ఆభరణాల దుకాణం ఉన్న ప్రాంతంలో, పరిసర ప్రాంతాల్లో కూడా అదనపు భద్రతను మోహరించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన అనేక మంది నెటిజన్లు వామ్మో.. అంటూ భయంతో కామెంట్లు చేస్తున్నారు.