Munugode By-Poll : డబ్బులు ఇవ్వకపోతే ఓటు వేసేది లేదంటున్న ఆగ్రామ ప్రజలు .. రంగంలోకి దిగిన పోలీసులు

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజక వర్గం అంతా మద్యం ఏరులైపారింది. నగదు భారీగా పంపిణీలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఓటర్లు కూడా ఆయా పార్టీలు ఇచ్చే డబ్బుల కోసం ఆశపడుతున్నట్లుగా తెలుస్తోంది. డబ్బులు ఇవ్వకపోతే ఓటు వేసేది లేదంటున్న ఓ గ్రామ ప్రజల నిర్ణయం చూస్తే డబ్బుకు ఓటు ఎలా అమ్ముడైపోతోంది తెలుస్తోంది. డబ్బులు ఇవ్వందే ఓటు వేసేది లేదంటున్నారు ఓ గ్రామ ప్రజలు..

Munugode By- Poll : మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు మద్యం, నగదు, ఇతర బహుమతులు ధారాళంగా ఖర్చు పెట్టిన ఆయా పార్టీల నేతలు ఓటర్లు తమవైపే ఉన్నారని తమపార్టీకే ఓటు వేస్తారనే నమ్మకంతో ఉన్నారు. మరోవైపు మునుగోడులో కొంతమంది ఓటర్లు మాత్రం ‘మాకు డబ్బులు అందలేదు..బహుమతులు అందలేదు..కాబట్టి మేం ఓటు వేయం’ అంటూ భీష్మించుకుని కూర్చున్నారు. అలా ఏదో పదిమంది ఓటర్లో..20మందో కాదు ఏకంగా ఓ గ్రామం గ్రామం అంతా డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తాం లేకుంటే ఓటు వేసేది లేదు అంటూ నిర్ణయం తీసుకుని ఓ చోట గుమిగూడి కూర్చున్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగారు.ఓటు వేయాల్సిందేనంటూ సదరు గ్రామ ప్రజలకు నచ్చచెబుతున్నారు.

Munugode By poll : తులం బంగారం, రూ.10వేలు ఇస్తేనే ఓటు వేస్తామంటున్న మునుగోడు మహిళలు..

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజక వర్గం అంతా మద్యం ఏరులైపారింది. నగదు భారీగా పంపిణీలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఓటర్లు కూడా ఆయా పార్టీలు ఇచ్చే డబ్బుల కోసం ఆశపడుతున్నట్లుగా తెలుస్తోంది. డబ్బులు ఇవ్వకపోతే ఓటు వేసేది లేదంటున్న ఓ గ్రామ ప్రజల నిర్ణయం చూస్తే డబ్బుకు ఓటు ఎలా అమ్ముడైపోతోంది తెలుస్తోంది. డబ్బులు ఇవ్వందే ఓటు వేసేది లేదంటున్నారు మునుగోడు నియోజక వర్గంలోనే అంతపేట  గ్రామ ప్రజలు..

Munugode By-Poll : ‘ఒట్టేసి చెబుతున్నా..మునుగోడు దాటిపోలేదు..పోనుకూడా’ : కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి కీలక వ్యాఖ్యలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఈక్రమంలో గట్టుప్పల్ మండలం అంతంపేటలో ఓటర్లు ఓటు వేయటానికి పోలింగ్ కేంద్రానికి రావటానికి ఇష్టడపటంలేదు. కారణం వారికి ఏ పార్టీవారు డబ్బులు ఇవ్వలేదట..నియోజకవర్గంలోనే దాదాపు అన్ని ప్రాంతాల్లోను ఆయా పార్టీల నేతలు భారీగా మద్యం, డబ్బులు పంచారు. మాకు మాత్రం ఎవ్వరు డబ్బులు ఇవ్వలేదు. కాబట్టి మేం ఎవ్వరం ఓటు వేయం అంటూ గ్రామంలోని ప్రజలంతా ఓచోట గుమిగూడి కూర్చున్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు వచ్చి ఓటు వేయటానికి రావాలని సూచించారు. కానీ మేం ఎవ్వరం ఓటు వేయం అంటూ గ్రామస్తులంతా తేల్చి చెప్పటంతో పోలీసులకు ఏం చేయాలో పాలుపోక షాక్ అయ్యారు.

కాగా మునుగోడు నియోజక వర్గంలో ఉప ఎన్నిక కొనసాగుతున్న క్రమంలో కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించటంతో పోలింగ్ కు అంతరాయం ఏర్పడింది. చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులో ఈవీఎంలు మొరాయించటంతో పోలింగ్ నిలిచిపోయింది. ఓటు వేయటానికి వచ్చిన ప్రజలు అంతా క్యూలైన్లలోనే కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Munugode by poll : బీజేపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులు .. మర్రిగూడెంలో తీవ్ర ఉద్రిక్తత..

 

ట్రెండింగ్ వార్తలు