Munugode By poll : తులం బంగారం, రూ.10వేలు ఇస్తేనే ఓటు వేస్తామంటున్న మునుగోడు మహిళలు..

తులం బంగారం, రూ.10వేలు ఇస్తేనే ఓటు వేస్తామంటున్నారు మునుగోడు మహిళలు. బహుమతుల కోసం మధ్యవర్తుల ఇళ్లకెళ్లి మరీ డిమాండ్ చేసిన దక్కించుకుంటున్నారు. మునుగోడులో మద్యం, నగదు, ఇతర కానుకల తీసుకోవటానికి కొంతమంది ఓటర్లు ఏమాత్రం వెనుకాడటంలేదు. అవకాశాన్ని బహుమతుల రూపంలో దక్కించుకుంటున్నారు.

Munugode By poll : తులం బంగారం, రూ.10వేలు ఇస్తేనే ఓటు వేస్తామంటున్న మునుగోడు మహిళలు..

Munugode By poll

Munugode By poll : మునుగోడు..మునుగోడు..మునుగోడు. తెలంగాణ వ్యాప్తంగా ఇదే పేరు వినిపిస్తోంది. మునుగోడు మొనగాడు ఎవ్వరు..మునుగోడు ఓటర్లు ఎవరిని ఎమ్మెల్యేని చేస్తారు? అనే మాటే వినిపిస్తోంది. ఈక్రమంలో మునుగోడు నియోజక వర్గం అంతా డబ్బులు..మద్యం..కానుకలు వెల్లువెత్తుతున్నాయి. మునుగోడు ఓట్లర్లను ఆకట్టుకోవటానికి ఆయా పార్టీల నేతలు తాపత్రాపడుతున్నారు. దీంతో మునుగోడులో మద్యం ఏరులైపారుతోంది. తాగినోడికి తాగినంతగా పోసేస్తున్నారు నాయకులు. బంగారం,వెండి,డబ్బులు,మద్యం ఇలా ఒకటేమిటి బహుమతులతో ఓటర్లకు గాలం వేస్తున్నారు గెలుపుకోసం. మరి ఓటర్లు మాత్రం తక్కువ తిన్నారా? ఏంటీ..తామేమి తక్కువకాదన్నట్లుగా గెలుపుకోసం నాయకులు నానా పాట్లు పడతుంటే..దాన్ని అవకాశంగా మార్చుకున్న ఓటర్లు డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తామని మొహంమీదే చెప్పేస్తున్నారు.

Munugode By-Poll : డబ్బులు ఇవ్వకపోతే ఓటు వేసేది లేదంటున్న ఆగ్రామ ప్రజలు .. రంగంలోకి దిగిన పోలీసులు

బహిరంగంగానే డబ్బులు అడుగుతున్నారు. డబ్బే కాదు బంగారం కూడా అడుగుతున్నారు మునుగోడులో కొంతమంది మహిళలు. తులం బంగారం,పదివేల రూపాయాలు ఇస్తేనే ఓటు వేస్తామని ఖరాఖండీగా చెప్పేస్తున్నారు. అంతేనా..నాయకులకు ఓటర్లకు మధ్యలో మధ్యవర్తులు ఉన్న వారిని నిలదీస్తున్నారు.ఏదీ డబ్బు..ఏదీ బంగారం అంటూ..ఏకంగా మధ్యవర్తుల ఇళ్లకెళ్లి పంచాయితీ పెట్టి మరీ డబ్బులు,బంగారం, కానుకలు డిమాండ్ చేస్తున్నారు. నాయకులు కూడా ఓటర్లను ఆకట్టుకోవటానికి మహిళలు తమ సొంతకార్లలో ఇళ్లకు తీసుకెళ్లి మరీ కానుకలు ఇచ్చి పంపిస్తున్నారు. అలా నాయకులు అవకాశాన్ని మునుగోడు మహిళా ఓటర్లు చక్కగా వాడేసుకుంటున్నారు. బంగారం,డబ్బును దండేసుకుంటున్నారు.

ఇంతకు మించిన తరుణం రాదు అన్నట్లుగా పోలింగ్ ముందే రాబట్టేసుకుంటున్నారు. కొంతమంది మధ్యవర్తులు కూడా మునుగోడు ఉప ఎన్నికలు చక్కగా వాడేసుకుంటున్నారు.ఆయా పార్టీల నేతల వద్ద డబ్బులు తీసుకుని ఓటర్లకు పంచకుండా వారే ఉంచేసుకుంటున్నారు. అటువంటివారిని మునుగోడులో మహిళా ఓటర్లు పంచాయితీ పెట్టి ..డబ్బు, బంగారం ఇస్తేనే ఓట్లు వేస్తామని డిమాండ్ చేసిన మరీ అడుగుతున్నారు. ఓ పార్టీకి చెందిన నేతలకు సంబంధించి వ్యక్తులు కొంతమంది మహిళలను కారులో తీసుకెళ్లి కానుకను ఇచ్చి పంపిస్తున్న వీడియోలు 10టీవీ కెమెరాకు చిక్కాయి. దీంతో మునుగోడులో ఓటర్ల తీరు..ఆయా పార్టీల నేతల మాయాజాలం కళ్లకు కట్టినట్లుగా తెలుస్తోంది.  ఓకారులోంచి కొంతమంది మహిళలు చేతిలో సంచులు పట్టుకుని కారు దిగుతున్న దృశ్యాలు 10టీవీ కెమెరాకు చిక్కాయి. ఆ మహిళల చేతుల్లో సంచులు ఉన్నాయి.వాటిలో సదరు పార్టీ నేతలు ఇచ్చిన బహుమతులు ఉన్నట్లుగా తెలుస్తోంది.