Nandamuri Balakrishna: టీడీపీతోనే భవిష్యత్తు: నందమూరి బాలకృష్ణ
టీడీపీ అధికారంలోకి వస్తేనే ఏపీలోని ప్రతి ఒక్కరికీ భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. మహానాడు సభలో శనివారం ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీపై విమర్శలు చేశారు.
- Narender Thiru
- Published On : May 28, 2022 / 08:07 PM IST
Nandamuri Balakrishna
Nandamuri Balakrishna: టీడీపీ అధికారంలోకి వస్తేనే ఏపీలోని ప్రతి ఒక్కరికీ భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. మహానాడు సభలో శనివారం ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీపై విమర్శలు చేశారు. ‘‘మూడేళ్లలో రాష్ట్రంలో ధరలు పెరిగాయి. అన్ని రకాల ఛార్జీలు విపరీతంగా పెంచేశారు. దేశమంటి మనుషులు కాదు.. దేశమంటే మట్టేనోయ్ అనే రీతిలో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పరిపాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లిన ఘనత చంద్రబాబుది. మహిళలకు స్వయం ఉపాధి కల్పించారు. ఐటీ రంగం ద్వారా యువతకు విదేశాల్లో ఉద్యోగాలు వచ్చేలా చేశారు.
Nara Lokesh: చంద్రబాబు రాముడైతే.. జగన్ రాక్షసుడు: నారా లోకేష్
టీడీపీతోనే భవిష్యత్తు. పార్టీకి ప్రజాశీస్సులు కావాలి. తెలుగు వారు కాని వాళ్లు కూడా తెలుగువాళ్లను గుర్తుపట్టేలా చేసిన ఘనత ఎన్టీఆర్‌దే. ఇప్పుడు గుడినే కాదు.. గుళ్లో లింగాన్నే మింగేసే ప్రభుత్వం ఉంది. నువ్వు-నేను కలిస్తే మనం. మనం-మనం కలిస్తే జనం.. జనం-జనం కలిస్తే ప్రభంజనం. ఇప్పుడు మహానాడు పసుపు సైన్యం ఓ ప్రభంజనంలా తరలి వచ్చింది. శత పురుషుడి శత జయంతి జరుపుకుంటున్నాం. పేదోడికి గూడు, కూడు ఇవ్వాలని ఎన్టీఆర్ తపించేవారు. ఆయన పేరు చెబితే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు గుర్తుకొస్తాయి’’ అని బాలకృష్ణ ప్రసంగించారు.
