Site icon 10TV Telugu

Deepthi Ganta : నా తమ్ముడ్ని హీరోగా పెట్టి మంచి లవ్‌స్టోరీతో సినిమా తీస్తాను..

Nani sister Deepthi wants to direct her brother

Nani sister Deepthi wants to direct her brother

Deepthi Ganta :  నాని హీరోగానే కాక నిర్మాతగా కూడా మంచి మంచి సినిమాలని తెరకెక్కిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా నిర్మాణ సంస్థని స్థాపించి పలు సినిమాలని తెరకెక్కిస్తున్నాడు నాని. నాని సోదరిగా దీప్తి అందరికి పరిచయమే. గతంలోనే ఓ షార్ట్ ఫిలింతో అందర్నీ మెప్పించింది దీప్తి. వాల్ పోస్టర్ సినిమా నిర్మాణ సంస్థలో కూడా పలు బాధ్యతలు చూసుకుంటుంది దీప్తి. తాజాగా నాని సోదరి దీప్తి దర్శకురాలిగా మారింది.

నాని అక్క దీప్తి తనే కథ రాసి దర్శకత్వం వహించింది. ‘మీట్ క్యూట్’ అనే పేరుతో దీప్తి ఓ సిరీస్ ని తెరకెక్కించింది. అయిదు డిఫరెంట్ కథలు ఉండే ఆంథాలజీగా ఈ సిరీస్ ని నాని నిర్మాణ్ సంస్థ అయిన వాల్ పోస్టర్ సినిమాలోనే నిర్మించారు. ఇందులో సత్యరాజ్‌, వర్ష బొల్లమ్మ, ఆదా శర్మ, రుహానీ శర్మ, శివ కందుకూరి.. పలువురు ప్రముఖులు నటించారు. ఈ మీట్ క్యూట్ సిరీస్ సోనిలివ్ ఓటీటీలో నవంబర్ 25న రానుంది.

Sankarabharanam : అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాలలో ‘శంకరాభరణం’ సినిమాకి అరుదైన గౌరవం..

తాజాగా ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించగా చిత్రయూనిట్ తో పాటు నాని కూడా విచ్చేశారు. ఈ ప్రెస్ మీట్ లో నాని సోదరి దీప్తి మాట్లాడుతూ.. ”నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు, చూసిన సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ ని తెరకెక్కించాను. కథకు తగ్గట్టు మంచి మంచి ఆర్టిస్టులు దొరికారు. మనసుకి హత్తుకునే కథలని ఇందులో చూస్తారు. భవిష్యత్తులో మంచి లవ్ స్టోరీ రాస్తే నానిని హీరోగా పెట్టి సినిమా తీస్తాను” అని తెలిపింది. మరి అక్క దర్శకత్వంలో నాని ఎప్పుడు నటిస్తాడో చూడాలి.

Exit mobile version