Sankarabharanam : అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాలలో ‘శంకరాభరణం’ సినిమాకి అరుదైన గౌరవం..

ప్రస్తుతం గోవాలో 53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఈ వేడుకల్లో క్లాసిక్ గా నిలిచిన ఒకప్పటి సినిమాలని డిజిటలైజ్ చేసి Restored Indian Classics విభాగంలో........

Sankarabharanam : అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాలలో ‘శంకరాభరణం’ సినిమాకి అరుదైన గౌరవం..

Shankarabharanam received special recognition at the 53rd IFFI

Sankarabharanam : ప్రస్తుతం గోవాలో 53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఈ వేడుకల్లో క్లాసిక్ గా నిలిచిన ఒకప్పటి సినిమాలని డిజిటలైజ్ చేసి Restored Indian Classics విభాగంలో భద్రపరుస్తారు. గోవాలో జరిగే 53వ IFFI – 2022లో ఈ విభాగంలో మన తెలుగు సినిమా ఆల్ టైం క్లాసిక్ “శంకరాభరణం” ఎంపికైంది.

Restored Indian Classics విభాగంలో National Film Archives of India వారు మన దేశంలొని గొప్ప చిత్రాలను డిజిటలైజ్‌ చేసి భద్రపరిచే కార్యక్రమంలొ బాగంగా ఈ సంవత్సరం తెలుగులో విశేష ఆదరణ పొందిన ఒకప్పటి గొప్ప క్లాసిక్ సినిమా ‘శంకరాభరణం’ని ఎంపిక చేశారు. ఈ సినిమాని చిత్రోత్సవాల్లో ప్రత్యేక ప్రదర్శన కూడా వేయనున్నారు. ఈ ప్రదర్శనకు చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరావు కుమారుడు ఏడిద రాజా ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరౌతారు.

Nithya Menen : పెళ్లంటే ఒక ఫైనాన్సియల్ సెటప్.. పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన నిత్యా మీనన్..

కళా తపస్వి శ్రీ. కే. విశ్వనాధ్ దర్శకత్వంలో పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై ఏడిద నాగేశ్వరావు నిర్మాణంలో సోమయాజులు ముఖ్యపాత్రలో తెరకెక్కిన ఈ సినిమా 1980లో విడుదలయి భారీ విజయం సాధించి, ఎన్నో అవార్డులని దక్కించుకొని తెలుగులో ఆల్ టైం క్లాసిక్ సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఇలాంటి సినిమాని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరోసారి గుర్తించడం శుభ పరిణామం.