Nithya Menen : పెళ్లంటే ఒక ఫైనాన్సియల్ సెటప్.. పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన నిత్యా మీనన్..

హీరోయిన్ నిత్యా మీనన్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. అటు సినిమాలతో పాటు సిరీస్ లు, ఓటీటీలో సినిమాలు కూడా చేస్తుంది. ఇటీవలే వండర్ వుమెన్ అనే ఓ సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది...............

Nithya Menen : పెళ్లంటే ఒక ఫైనాన్సియల్ సెటప్.. పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన నిత్యా మీనన్..

Nithya Menen interesting comments on Marriage

Nithya Menen : హీరోయిన్ నిత్యా మీనన్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. అటు సినిమాలతో పాటు సిరీస్ లు, ఓటీటీలో సినిమాలు కూడా చేస్తుంది. ఇటీవలే వండర్ వుమెన్ అనే ఓ సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది నిత్యా. ఈ సినిమా సోనిలివ్ ఓటీటీలో విడుదలయింది. ఇందులో నిత్యా ప్రెగ్నెంట్ వుమెన్ గా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ ని గ్రాండ్ గానే చేస్తున్నారు చిత్ర యూనిట్.

34 ఏళ్ళు వచ్చినా నిత్యా పెళ్లి గురించి మాట్లాడట్లేదు. గత కొన్ని రోజుల క్రితం మలయాళ యూట్యూబర్ తో నిత్యా పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి, దీనిపై నిత్యా సీరియస్ గానే స్పందించింది. తాజాగా వండర్ వుమెన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నిత్యా మీనన్ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Abbas : హాస్పటల్‌లో ఒకప్పటి స్టార్ హీరో.. సర్జరీ ముందు భయమేసింది అంటూ పోస్ట్..

నిత్యా మీనన్ పెళ్లి గురించి మాట్లాడుతూ.. ”నేను పక్కా ట్రెడిషినల్ అమ్మాయిని. మన కల్చర్, సంప్రదాయాలని గౌరవిస్తాను. పెళ్లంటే ఒక సోషల్, ఫైనాన్సియల్ సెటప్. అలాంటివాటితో పెళ్లి ముడిపడి ఉంది. నాకు అలాంటి సెటప్ కోసం అయితే పెళ్లి అవసరం లేదు. ఎవరైనా అబ్బాయి దానికి మించి ఆలోచించేవాళ్ళు దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను” అని తెలిపింది. మరి నిత్యా కావాలనుకునేలా ఆలోచించే అబ్బాయి ఎప్పుడు దొరుకుతాడో.