Congress new president
National Herald case: నేషనల్ హెరాల్డ్ దినపత్రికకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు.. ఇవాళ ఢిల్లీ, ముంబైలో సోదాలు జరుపుతున్నారు. ఢిల్లీలో నేషనల్ హెరాల్డ్ వార్తా సంస్థ కేంద్ర కార్యాలయం, ఇతర అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన సంస్థల్లో సోదాలు ముగిశాయి. ఢిల్లీలో మొత్తం 12 ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరిపింది. ప్రస్తుతం ముంబైలో సోదాలు కొనసాగుతున్నాయి.
దర్యాప్తు సంస్థలను వాడుకుని కేంద్ర ప్రభుత్వం దేశంలోని విపక్ష పార్టీల నేతలను అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపణలు వస్తోన్న వేళ ఈ సోదాలు జరుగుతుండడం గమనార్హం. నేషనల్ హెరాల్డ్ దినపత్రికకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కూడా ఈడీ విచారించిన విషయం తెలిసిందే. అనంతరం సోనియా గాంధీని విచారించింది.
నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులు వైఐఎల్‌కి బదలాయింపు, షేర్ల వాటాలు,ఆర్ధిక లావాదేవీల అంశాలపై ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ విచారించడం పట్ల దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు తెలిపారు. ఈడీతో దాడులు చేయిస్తూ తమ గళాన్ని ఆపలేరని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఇవాళ ట్వీట్ చేశారు.
China: చైనా నుంచి ముప్పు.. భారీ యుద్ధ విన్యాసాలు చేపట్టిన తైవాన్