Nayanthara: కెరీర్‌లో తొలిసారి ఆ క్రేజీ హీరోతో రొమాన్స్‌కు రెడీ అయిన నయన్..?
సౌత్ ఇండియన్ స్టార్ బ్యూటీ నయనతార ఇటీవల సరోగసి వివాదంలో చిక్కున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆమెకు మద్దతుగా కొందరు నిలిస్తే, ఇదేం విడ్డూరం అంటూ మరికొందరు ఆమెపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు మళ్లీ తన ఫోకస్ సినిమాలపై పెట్టిందట నయన్.
- Anil Aaleti
- Published On : November 12, 2022 / 06:55 PM IST
Nayanthara To Romance Madhavan
Nayanthara: సౌత్ ఇండియన్ స్టార్ బ్యూటీ నయనతార ఇటీవల సరోగసి వివాదంలో చిక్కున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆమెకు మద్దతుగా కొందరు నిలిస్తే, ఇదేం విడ్డూరం అంటూ మరికొందరు ఆమెపై విమర్శలు గుప్పించారు. తన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లయ్యింది ఈ స్టార్ బ్యూటీ. ఇక ఈ విషయాన్ని పక్కనబెడితే, ఇప్పుడు మళ్లీ తన ఫోకస్ సినిమాలపై పెట్టిందట నయన్.
Nayanthara: ముగిసిన నయనతార సరోగసి వివాదం..
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ఫాదర్ సినిమాలో నటించిన నయనతార, ఇప్పుడు ఓ క్రేజీ స్టార్ హీరోతో రొమాన్స్‌కు రెడీ అయ్యిందట. ఇటీవల కాలంలో నయనతార వేరొక హీరోతో రొమాన్స్ చేసిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. కంటెంట్ ఓరియెంటెడ్, లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే నయన్ ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ వచ్చింది. అయితే తాజాగా ఓ క్రేజీ హీరో సరసన ఈ బ్యూటీ రొమాన్స్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తనదైన యాక్టింగ్‌తో వర్సటైల్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న మాధవన్ నటించబోయే నెక్ట్స్ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.
Nayanthara: నయనతార సరోగసి వివాదంలో సరికొత్త ట్విస్ట్..
ఇక ఈ సినిమాను శశికాంత్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో సిద్ధార్థ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడట. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా ఈ సినిమాను 2023 జనవరి నెలలో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
