Nayanthara: నయనతార సరోగసి వివాదంలో సరికొత్త ట్విస్ట్..

ఇటీవల నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ.. వారిద్దరూ కవలలకు జన్మనిచ్చి తల్లిదండ్రులు అయ్యినట్లు ప్రకటించారు. అయితే వీరిద్దరూ సరోగసీ ద్వారా అమ్మానాన్నలు అయ్యారంటూ వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం.. "పిల్లలు ఎలా పుట్టారో వివరాలు సమర్పించాలంటూ" ఇటీవల నయనతార దంపతులను వివరణ కోరింది.

Nayanthara: నయనతార సరోగసి వివాదంలో సరికొత్త ట్విస్ట్..

New twist in Nayanthara surrogacy controversy

Nayanthara: ఇటీవల నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ.. వారిద్దరూ కవలలకు జన్మనిచ్చి తల్లిదండ్రులు అయ్యినట్లు ప్రకటించారు. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకుని 4 నెలలు మాత్రమే కావడంతో.. ఈ జంట అద్దె గర్భం ద్వారా కవలలకు తల్లిదండ్రులు అయ్యారంటూ వార్తలు వినిపించాయి.

Nayanthara: పిల్లలు ఎలా పుట్టారో వివరాలు సమర్పించాలంటూ.. నయన్ దంపతులకు తమిళనాడు ప్రభుత్వం నోటీసులు!

భారతదేశంలో సరోగసి ద్వారా పిల్లలకు తల్లిదండ్రులు అవ్వడం చట్టరీత్యా నేరం. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం.. “పిల్లలు ఎలా పుట్టారో వివరాలు సమర్పించాలంటూ” ఇటీవల నయనతార దంపతులను వివరణ కోరింది. ఈ మేరకు ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయగా, నేడు కమిటీ ఆ అఫిడివిట్ ని ప్రభుత్వానికి అందజేశారు.

ఈ నివేదికలో నయనతార.. తన భర్త విగ్నేష్ శివన్ ను ఆరేళ్ల కిందటే పెళ్లి చేసుకున్నట్లు ఆధారాలు సమకూర్చినట్లు తెలుస్తుంది. భారతీయ సరోగసి చట్టం ప్రకారం తల్లిదండ్రులు కావాలంటే పెళ్లి అయ్యి 5 ఏళ్ళు పూర్తీ కావాలి. ఈ పద్దతిలోనే వారిద్దరూ కవలలకు అమ్మానాన్నలు అయ్యినట్లు వెల్లడించారు.