Cyclone Asani : మూడు రాష్ట్రాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిధ్ధం

అసని తుపాను నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో  50 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. 22 బృందాలు క్షేత్ర స్థాయిలో, 28 స్వీయ-నియంత్రణ బృందాలు పరిస్థితిని పరిష్కరించడానికి రాష్ట్రాలలో అప్రమత్తంగా ఉన్నాయని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు తెలిపారు. 

Cyclone Asani :  అసని తుపాను నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో  50 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. 22 బృందాలు క్షేత్ర స్థాయిలో, 28 స్వీయ-నియంత్రణ బృందాలు పరిస్థితిని పరిష్కరించడానికి రాష్ట్రాలలో అప్రమత్తంగా ఉన్నాయని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు తెలిపారు.  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాల నుండి   వాయువ్య బంగాళాఖాతం వైపు కదులుతున్న తుఫాను వచ్చే 24 గంటల్లో క్రమంగా బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

12 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు పశ్చిమ బెంగాల్‌లోని కోస్తా జిల్లాల్లో, 09 బృందాలు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో మోహరించాయి.  ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని సిధ్దంగా ఉంచారు.  IMD నుండి ముందస్తు హెచ్చరిక జారీ అయినప్పటి నుండి, NDRF సిబ్బంది తుఫాను సమయంలో చేయవలసినవి, చేయకూడని వాటి గురించి ప్రజలకు అవగాహన  కార్యక్రమాలను  నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, తుఫాను షెల్టర్‌ కేంద్రాలకు తరలించారు. తుఫాను పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్న ఎన్‌డిఆర్‌ఎఫ్ హెడ్ క్వార్టర్స్ సిబ్బంది ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని ప్రయత్నాలను తీసుకుంటోందని వెల్లడించింది.

మరోవైపు అసని తుపాను దిశ మార్చుకుంది అని  వస్తున్న వార్తల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని దివిసీమలోని  తీర ప్రాంత గ్రామాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. నాగాయలంక మండలం గుల్లలమొద, సొర్లగొంది, ఎదురు మొండి, నాలి, నాచుగుంట,ఈలిచెట్ల దిబ్బ, కోడూరు మండలంలోని  పాలకాయతిప్ప, బసవానిపాలెం, జార్జిపేట గ్రామాల్లో రెవెన్యూ, పోలీస్, ఫిషరీస్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.  తీరం వెంబడి ఈదురు గాలులు హోరు పెరిగింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, ఒకవేళ ఎవరైనా సముద్రంలో ఉంటే బైటకు వచ్చేయాలని అధికారులు ప్రచారం చేస్తున్నారు.

Also Read : Indian Army : అర్ధరాత్రివేళ నదిలో చిక్కుకున్న యువకులను కాపాడిన ఆర్మీ

ట్రెండింగ్ వార్తలు