Indian Army : అర్ధరాత్రివేళ నదిలో చిక్కుకున్న యువకులను కాపాడిన ఆర్మీ

అర్ధరాత్రి వేళ నదిలో చిక్కుకున్న ఇద్దరు యువకులను ఆర్మీ కాపాడింది. ఇందుకు సంబంధించిన వీడియోలను ఇండియన్ ఆర్మీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. 

Indian Army : అర్ధరాత్రివేళ నదిలో చిక్కుకున్న యువకులను కాపాడిన ఆర్మీ

Indian Army

Indian Army :  అర్ధరాత్రి వేళ నదిలో చిక్కుకున్న ఇద్దరు యువకులను ఆర్మీ కాపాడింది. ఇందుకు సంబంధించిన వీడియోలను ఇండియన్ ఆర్మీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.  వివరాల్లోకి వెళితే …. జమ్మూ కాశ్మీర్ లోని కిషాత్ వార్ జిల్లా   సోహాల్ గ్రామంలో  ప్రవహిస్తున్న చినాబ్ నదిని   జేసీబీ సాయంతో దాటేందుకు ఇద్దరు యువకులు శనివారం రాత్రి  ప్రయత్నించారు.

వారు నది మధ్యలోకి వెళ్లే సరికి నదిలో నీటి ఉధృతి పెరిగింది.  దీంతో  జేసీబీ ముందుకు కదల్లేదు.  నది మధ్యలో యువకులు ఇద్దరు చిక్కుకుపోయారు. సమాచారం తెలుసుకున్న  స్ధానికులు పోలీసులకు, స్ధానిక అధికారులకు, ఆర్మీకి  సమాచారం ఇచ్చారు. వెంటనే ఆర్మీకి చెందిన 17వ  రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్  సైనికులు అర్ధరాత్రి వేళ సహయక చర్యలు చేపట్టారు.

యువకులు  నది మధ్యలో చిక్కుకున్న  ప్రాంతానికి చేరుకున్నారు.  వారిద్దరినీ జేసీబీ పైకి చేరాలని సూచనలు ఇచ్చారు.  నదికి ఇరువైపులా ఎత్తులో పెద్ద తాడు కట్టారు. ఒక జవాను తాడు సహాయంతో వారి వద్దకు చేరుకుని వారిద్దరినీ  సురక్షితంగా ఒడ్డుకు తీసుకు వచ్చాడు.  దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అక్కడ గూమి కూడిన గ్రామస్ధులు ఈ రెస్క్యూ ఆపరేషన్ ను ఉత్కంఠతో తిలకించారు.

ఈ రెస్క్యూ ఆపరేషన్‌కు  సంబంధించిన  ఫోటోలు వీడియోలను ఆర్మీ ఉత్తర కమాండ్   తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అర్ధరాత్రి వేళ రెస్క్యూ ఆపరేషన్   చేసి యువకులను కాపాడిన భారత  సైన్యం ధైర్య సాహసాలను పలువురు నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.