Netaji's great-granddaughter
Netaji’s great-granddaughter: నేతాజీ సుభాష్ చంద్రబోస్ మునిమనవరాలు రాజశ్రీ చౌదరి బోస్‌ను పోలీసులు నిన్నటి నుంచి హౌస్ అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో ఆమెను రైలు నుంచి దించి మరీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. వారణాసిలో విశ్వ హిందూ సేన నిర్వహించనున్న కార్యక్రమానికి రాజశ్రీ చౌదరి బోస్ ముఖ్య అతిథిగా వెళ్ళాల్సి ఉంది. అయితే, ఆ కార్యక్రమానికి బోస్ వెళ్ళేందుకు అనుమతి లేదంటూ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
ఆమెను రిజర్వ్ పోలీస్ లైన్స్ లోని అతిథి గృహంలో ఉంచామని పోలీసులు తెలిపారు. అక్కడికి వెళ్ళేందుకు మీడియాకు పోలీసులు అనుమతి ఇవ్వట్లేదు. రాజశ్రీ చౌదరి బోస్‌ను పోలీసులు నిన్నటి నుంచి హౌస్ అరెస్ట్ చేయడంపై విశ్వ హిందూ సేన అధ్యక్షుడు అరుణ్ పాఠక్ స్పందించారు. కాశీ విశ్వనాథ్ మందిరంలో జలాభిషేకం చేేసేందుకు తాము వెళ్ళాలనుకున్నామని, ఈ నేపథ్యంలోనే వారణాసికి వెళ్తున్నామని చెప్పారు.
సుభాష్ చంద్రబోస్ మునిమనవరాలు రాజశ్రీ చౌదరి బోస్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంపై పూర్తి వివరాలు తెలపలేదు. రాజశ్రీని మాత్రమే పోలీసులు గెస్ట్ హౌస్‌లో గృహనిర్బంధంలో ఉంచారు. ఆమె వారణాసికి చేరుకోకుండా నేడు కూడా నిర్బంధంలోనే ఉంచుతామని, వారణాసిలో ఆ కార్యక్రమం ముగిశాక విడుదల చేస్తారని పోలీసు అధికారులు చెప్పారు.
Arvind Kejriwal to centre: ప్రజలకు ఉచితాలు ప్రకటిస్తే తప్పేంటి?: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్